
కారు ఇప్పించాలి
నాలుగేళ్ల కిందట కారు కొనుగోలు చేశా. నా కొడుకు బాడుగలకు వెళ్లేవాడు. గతేడాది డిసెంబర్‌లో మృతి చెందారు. అయితే, అప్పటి నుంచి కారు కనిపించలేదు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశా. తుళ్లూరు మండలం రాయపూడిలో కారుని గుర్తించారు. గత ఎన్నికల్లో రాయపూడిలో ఓ టీడీపీ నేత అధీనంలో ఉందని తెలిసింది. గత నెల 18న స్థానిక పోలీస్‌స్టేషన్‌కు కారు తీసుకు వచ్చారు. అవతలి వ్యక్తికి రూ.1.50 లక్షలు చెల్లించాలని చెబుతున్నారు. అయితే, తాను ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరంలేదు. అదిగాక ఓ వ్యక్తి వద్ద రూ.15 లక్షలు తీసుకున్నట్లు గత నెలలో కోర్టు ద్వారా నోటీసులు పంపించారు. కారు ఇప్పించకపోగా తమపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక ఉన్న తమపై కేసులు బనాయిస్తున్నారు. ఇప్పటికే జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో మూడుసార్లు ఫిర్యాదు చేశా. అయినా, ఎవరూ పట్టించుకోవడంలేదు. అంధుడిని కావడంతో పోలీస్‌స్టేషన్ల చుట్టు తిరగలేకపోతున్నా. అవతలి వ్యక్తులు బెదిరిస్తున్నారు. నాకు న్యాయం చేయాలి.
– నాగిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, జూనియర్ సహాయకుడు,
గుంటూరు మెడికల్ కళాశాల