డీఆర్‌ఎం రామకృష్ణ బదిలీ
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు డీఆర్‌ఎం ఎం.రామకృష్ణ బదిలీ అయ్యారు. ఆయన నైరుతీ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. స్థానిక పట్టాభిపురం రైల్వే డివిజనల్ కార్యాలయంలో శుక్రవారం ఆయనకు అభినందన సభ నిర్వహించారు. ఈసందర్భంగా డివిజన్ ఏడీఆర్‌ఎం సైమన్ మాట్లాడుతూ రామకృష్ణ కృషిని కొనియాడారు. డీఆర్‌ఎం రామకృష్ణ మాట్లాడుతూ సంతృప్తికరంగా విధులు నిర్వర్తించినట్టు వివరించారు. అనంతరం రామకృష్ణను ఏడీఆర్‌ఎం సైమన్, సీనియర్ డీపీఓ షహబాజ్ హానూర్, సీనియర్ డీపీఓ రత్నాకర్, సీనియర్ డీఎస్‌టీఈ మద్దాలి రవికిరణ్, సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్, యూనియన్ నాయకులు, సంఘ్ యూనియన్ తదితరులు సత్కరించారు.


