శ్రీరంగపురం(చేబ్రోలు): చేబ్రోలు మండలం శ్రీరంగపురం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌గా వైఎస్సార్ సీపీకి చెందిన పోతురాజు నాగమ్మ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉదయం ఈవోపీఆర్డీ టి. ఉషారాణి పర్యవేక్షణలో ఎన్నికను నిర్వహించారు. పంచాయతీ ఒకటో వార్డు మెంబరు పోతురాజు నాగమ్మను సభ్యులందరూ ఆమోదించడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నికల అధికారి ఉషారాణి నాగమ్మకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. అనంతరం ఉప సర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేయించారు. ఏకగ్రీవంగా ఎన్నికై న నాగమ్మను గ్రామ సర్పంచ్ జాస్తి సాంబశివరావు, తిరుమలశెట్టి బాల, చెరుకూరి భాస్కరరావు, పి. శివశంకర్, వైఎస్సార్ సీపీ నాయకులు అభినందించారు.


