గుంటూరు, పల్నాడు జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల కడుపు మంటతో విప్లవం మొదలైందని అన్నారు. వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు భృతి హామీ అమలు చేయాలని పేర్కొన్నారు. లేకుంటే రాస్తారోకోలు, ఆమరణ నిరాహార దీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.
● వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్.నూరిఫాతిమా మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఎంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు సర్కారు యత్నిస్తోందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఏపీ అంతటా 17 వైద్య కళాశాలలను ఏర్పాటుచేయగా అందులో ఐదు కళాశాలలను ప్రారంభించారని పేర్కొన్నారు. వీటిని ప్రైవేటుపరం చేసేందుకు కూటమి కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు.