
చెరుకుపల్లి: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని గూడవల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లింగమనేని వెంకటేశ్వరరావు(70) జాతీయ రహదారిపై గ్రామ సమీపంలోని గంగాయి చానల్ వైపు బైక్‌పై వెళుతున్నాడు. ఈ సమయంలో చెరుకుపల్లి వైపు నుంచి భట్టిప్రోలు వైపు వెళుతున్న మిక్సర్ టిప్పర్ వెనుకగా ఢీకొనటంతో వెంకటేశ్వరరావు మృతి చెందాడు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ వై.సురేష్ పరిశీలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.