ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్ (Global Village) అయిన తరుణంలో జనం మెరుగైన జీవనం గడపడానికి అవకాశాలు ఉన్న చోటుకు వెళ్లి జీవిస్తున్నారు. ప్రపంచంలోనే అధిక జనాభా ఉన్న భారతదేశం (India) నుంచే అత్యధికంగా ఇతరదేశాలకు వలస వెళు తున్నారు. 2024 ఐక్యరాజ్యసమితి ప్రపంచ వలస నివేదిక (యూఎన్ వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్) ప్రకారం కోటీ ఎనభై లక్షలమంది దాకా ఆ ఏడాది భారత్ నుంచి వలస పోయారు.
భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం 2024 మే నాటికి వివిధ దేశాల్లో ఉన్న భారతీయుల సంఖ్య దాదాపు మూడు కోట్ల 92 లక్షల మంది. ఇందులో రెండుకోట్ల 35 లక్షలమంది ఎన్‌ఆర్‌ఐలు (NRIs) ఉన్నారు. మిగతావారు భారతీయ సంతతికి చెందినవారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే అత్యధికంగా (54 లక్షలు) అమెరికాలోనే పనిచేస్తున్నారు. ఇది అమెరికా జనాభాలో 1.6 శాతంగా ఉంది.
వ్యాపారాలు చేస్తూ, పన్నులు చెల్లిస్తూ అపరిమిత ఆదాయాన్ని అమెరికాకు సాధించి పెడుతున్నప్పటికీ అమెరికాలో ప్రెసిడెంట్ మారినప్పుడల్లా అభద్రతా భావంతో మనవారు కునారిల్లుతున్నారు. 47వ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విదేశీయులకు అమెరికా గడ్డమీద జన్మించే పిల్లలకు జన్మతః లభించే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఆర్డర్ జారీచేశారు.(దీన్ని అక్కడి కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది).
Birthright citizenship : ట్రంప్ ఆర్డర్‌ను తోసిపుచ్చిన కోర్టు, ఎన్‌ఆర్‌ఐలకు భారీ ఊరట
దీంతో అనేకమంది అమెరికాలో నివసిస్తున్న భారతీయ గర్భిణులు ట్రంప్ విధించిన గడువులోపు పిల్లల్ని బలవంతంగా కనడానికి ఆస్పత్రుల దగ్గర బారులు తీరారంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థమవుతుంది.అమెరికాలోని ప్రవాస భారతీయులకు మన కేంద్ర ప్రభుత్వం ఆత్మస్థైర్యం కల్పించే చర్యలు తీసుకోవాలి. ప్రధాని నరేంద్ర మోదీకి డొనాల్డ్ ట్రంప్‌తో ఉన్న స్నేహం మనవారికి మేలు చేస్తుందేమో చూడాలి.
చదవండి: హోటల్లో అంట్లు కడిగాడు, ఆత్మహత్యాయత్నం..కట్ చేస్తే.. రూ 500 కోట్లు
– ఎండి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్ 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
