దేశవ్యాప్తంగా న్యాయ ‘కొరత’ | The India Justice Report 2025 was recently released | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా న్యాయ ‘కొరత’

May 16 2025 3:51 AM | Updated on May 16 2025 3:51 AM

The India Justice Report 2025 was recently released

ప్రతి వ్యవస్థనూ – అది సాధించాల్సిన ఫలి తాలు సాధించేలా – పరిపూర్ణంగా రూపొందిస్తారు. మరి భారత న్యాయ వ్యవస్థ మాటే మిటి? పనితీరులో వెనుకబాటుతనం, అసమానత్వం, జాప్యం... ఇవేనా దీని నుంచి మనం ఆశించిన ఫలితాలు? ఇటీవలే ‘ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌ 2025’ వెలువడింది. 18 పెద్ద రాష్ట్రాలు, 7 చిన్న రాష్ట్రాల్లో ప్రజలకు న్యాయం ఎలా అందు తోందో ఇది అద్దం పడుతోంది. 

పాత నివేదికల మాదిరిగానే ఇది కూడా పోలీసు, జ్యుడీషియరీ, జైళ్లు, న్యాయ సహాయం గురించి విపులంగా చర్చించింది. ఆ యా రంగాల్లో వ్యవస్థాగత సామర్థ్యాలు తగిన స్థాయిలో లేవనీ, వాటిని పెంచుకోవలసి ఉందనీ ఈ నివేదిక తేల్చింది. అనేక మందికి ఈ వ్యవస్థ అందుబాటులో ఉండటం లేదు. తను చేయగలిగినంతా చేస్తోంది. అయినా అత్యవసర న్యాయ సేవను అవసరమైన స్థాయిలో అందించలేక పోతోంది. 

సిబ్బంది కొరతతో న్యాయంలో లోటు
రాష్ట్ర బడ్జెట్ల మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. జస్టిస్‌ సిస్టమ్‌కు తగినన్ని నిధుల కేటాయింపు జరగటం లేదు. కేటాయింపుల్లోసింహభాగం జీతాలకే పోతుంది. మౌలిక సదుపాయాలు, పరిక రాలు, నైపుణ్యాల పెంపునకు మిగిలే నిధులు అంతంత మాత్రమే. రాష్ట్రాల జీడీపీలు పెరిగిన సందర్భాల్లోనూ, ఏవో కొన్ని రాష్ట్రాలు మాత్రమే అదే నిష్పత్తిలో జ్యుడీషియరీకి నిధులు పెంచుతున్నాయి.  న్యాయ వ్యవస్థలు మొత్తం మీద 25 శాతం సిబ్బంది కొరత ఎదుర్కొంటున్నాయి. హైకోర్టు జడ్జీలలో 31 శాతం, పోలీసుయంత్రాంగంలో 22 శాతం, జైళ్ల శాఖలో 33 శాతం ఖాళీలు భర్తీ చేయ కుండా పడున్నాయి. పోలీసు స్టేషన్‌ పర్యవేక్షణలో ఉండే జనాభా, ప్రాంతం చాలా ఎక్కువగా ఉండటం మరో సమస్య. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు స్టేషన్లు తక్కువగా ఉంటున్నాయి.

దీంతో గ్రామీణులకు న్యాయ పరిష్కారాల లభ్యత తగ్గిపోతోంది. సివిల్‌ పోలీసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నప్పటికీ, నిరంతరం ఖాళీలు ఉంటూనే ఉన్నాయి. దీంతో ఈ వ్యవస్థా కుంటినడక నడు స్తోంది. జాతీయస్థాయిలో ప్రతి అయిదు పోస్టుల్లో ఒకటి ఖాళీగాఉంటోంది. అంటే 5,00,000 మందిని నియమించాల్సి ఉంది. జనాభా–పోలీసు నిష్పత్తి అతి తక్కువగా ఉండే ప్రపంచ దేశాల్లోఇండియా ఒకటి. మన పోలీసు దళాల్లో 80 శాతం మంది కానిస్టేబుళ్లు ఉంటారు. సూపర్‌వైజరీ, టెక్నికల్‌ విభాగాల్లో 35 శాతం ఖాళీలుఉండటంలో పర్యవేక్షణ అధికారులు తక్కువ అవుతున్నారు. 

నియామక ప్రక్రియ లోపభూయిష్ఠంగా ఉండటం వాస్తవం. ఎప్పుడు ప్రకటన వెలువడుతుందో తెలియదు. చివరకు ప్రకటన వెలువడినా నియామకాలు పూర్తి కావడానికి రెండేళ్లకు పైగా పడుతోంది. దీంతో శిక్షణ సంస్థల మీద భారం పెరిగి శిక్షణ ప్రక్రియ తూతూ మంత్రంగా సాగుతోంది. సిబ్బంది సరైన అవగాహన లేకుండానే విధుల్లోకి వస్తున్నారు. ఇది ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తోంది. శిక్షణ సంస్థలకు నిధుల కొరత కూడా ఉంది. పోలీసు బడ్జెట్లో కేవలం 1 శాతమే వీటికి దక్కుతోంది. సిబ్బంది వైఫల్యాలకు అధికారులు వీటిని సాకులుగా చూపిస్తున్నారు. న్యాయలోపానికి వారు ఇలా కార ణాలు చూపించే వీల్లేదు. ఇది ప్రమాదకరమైన సమస్య. ఇది విధాన పరమైన వైఫల్యాలకూ దోషులు శిక్షలు పడకుండా తప్పించు కోవడానికీ దారితీస్తుంది.

పెండింగ్‌ కేసుల గుట్ట
ఇక జ్యుడీషియల్‌ వ్యవస్థలో 5 కోట్లకు పైగా పెండింగు కేసులు మూలుగుతున్నాయి. జనాభాలో ప్రతి 10 లక్షల మందికి కేవలం 15 మంది జడ్జీలు ఉన్నారు. 40 ఏళ్ల క్రితమే 50 మంది ఉండాలని సిఫారసు చేసినా, మంజూరైన 21 పోస్టులు కూడా భర్తీ కావడం లేదు. ప్రతి హైకోర్టు న్యాయమూర్తీ 7,000కి పైగా కేసులు పరిష్కరించాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. దిగువ కోర్టుల్లో ఈ సంఖ్య 2,200. ఈ నేపథ్యంలో అపరిష్కృత వ్యాజ్యాల సంఖ్య త్వరలోనే 6 కోట్లకు చేరుకోబోతోంది. 

పర్యవసానంగా, జైళ్లు కిక్కిరిసి పోతున్నాయి. బెయిలు మంజూ రుపై సుప్రీం మార్గదర్శకాలతో పాటు, అండర్‌ ట్రయల్‌ రివ్యూ కమిటీలు, డిఫెన్సు కౌన్సెల్‌ స్కీములు, బెయిలుకు ప్రభుత్వ నిధులు, జైలువారీగా లీగల్‌ క్లినిక్స్, వేల కొద్దీ న్యాయ సహాయ లాయర్లువంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నప్పటికీ... పదేళ్లలో ఖైదీల రద్దీ 18 నుంచి 30 శాతానికి పెరిగింది. 1,330 జైళ్లు ఉండగా, 90 కారాగారాల్లో సామర్థ్యానికి రెట్టింపు సంఖ్యలో ఖైదీలు కిటకిటలాడుతున్నారు. 

ఉత్తర ప్రదేశ్‌లోని మురాదాబాద్‌ వంటి కొన్ని చెరసాలల్లో ఉండ వలసిన వారి కంటే నాలుగు రెట్ల మంది ఉంటున్నారు. సుప్రీం కోర్టుకు సమర్పించిన ఒక నివేదిక ప్రకారం, 40 శాతం మందికి నిద్ర పోవాలంటే కూడా స్థలం కరవే! ఖైదీలలో సుమారు మూడో వంతు మందే దోషులుగా శిక్ష అనుభవిస్తున్నవారు... మిగిలినవారుఅందరూ విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలే! వీరిలో అత్యధికులు అట్టడుగు వర్గాల వారు. పేదరికం ఇక్కడ నిజమైన నేరం. 

ఆహ్వానించదగిన మార్పులు
ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ, కొన్ని సానుకూల అంశాలు కూడా లేకపోలేదు. బడ్జెట్లు పెరుగుతున్నాయి. ఫోరెన్సిక్‌ ల్యాబ్స్‌ను ఆధునికంగా మార్చుతున్నారు. టెక్నాలజీ వినియోగంలోకి వస్తోంది. ఢిల్లీ డిజిటల్‌ వ్యాజ్య నిర్వహణ విధానం, తెలంగాణ ఇ–ప్రిజన్‌ సిస్టమ్స్, మహారాష్ట్ర ఏఐ ఆధారిత లీగల్‌ ఎయిడ్‌ చాట్‌ బాట్స్, తమిళనాడు పోలీసు స్టేషన్లలో మెరుగైన సీసీటీవీ కవరేజీ ఇందుకు ఉదాహరణలు.  

బిహార్‌ పోలీసు దళాల్లో స్త్రీల వాటా 24 శాతానికి పెరిగింది. సబార్డినేట్‌ కోర్టు జడ్జీల్లో మహిళలు 38 శాతానికి పెరిగారు. అయితే, హైకోర్టుల్లో ఇది 14 శాతం మాత్రమే! ప్రప్రథమంగా, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు, జైలు సిబ్బందిలో ట్రా¯Œ ్సజెండర్ల గణన అధికారికంగా చేపట్టారు. కేరళ ప్రభుత్వం కోర్టు రూములు దివ్యాంగులకు అను కూల రీతిలో ఉండేలా చర్యలు చేపట్టింది.

ఆ యా కులాల ప్రాతినిధ్యం కూడా పెరుగుతోంది. వాణిజ్య వివాదాల్లో మధ్యవర్తిత్వ విధానాన్ని గుజరాత్‌ ప్రాచుర్యంలోకితెస్తోంది. కోర్టుల్లో రద్దీ తగ్గించడానికి వీలుగా సైబర్‌ క్రైమ్‌ యూనిట్లు, పోక్సో, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు వంటి ప్రత్యేక సంస్థలు ఏర్పాటు అవుతున్నాయి.సంస్థలు బలహీనంగా ఉన్నా వ్యక్తిగత చొరవ సత్ఫలితాలు ఇస్తుంది. ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక శ్రద్ధ వహించి జైళ్ల ఆక్యుపెన్సీ రేటును 91 నుంచి 83 శాతానికి తగ్గించి, ఖైదీలకు వసతి సదుపాయం పెంచగలిగారు. 

అలాగే అధికారుల ఖాళీలను 46 శాతం నుంచి 14 శాతానికి తగ్గించారు. సంకల్పంఉంటే మార్గం ఉంటుంది. న్యాయం అనేది మాటలకే పరిమితమైన ఒక ఉన్నత ఆదర్శం కాదు. అది సాధించగలిగిన లక్ష్యం. దాన్ని అందించే బాధ్యత ప్రభు త్వాల మీద, కోర్టుల మీద ఉంది. మనం చట్టబద్ధ ప్రజాస్వామ్యంలో కొనసాగాలంటే, ప్రతి ఒక్కరికీ ప్రతిరోజూ నిరంతర ప్రాతిపదికన న్యాయం అందాలి. 

-వ్యాసకర్త ‘ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌’ చీఫ్‌ ఎడిటర్‌(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)
-మాజాదారూవాలా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement