మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. శరీరానికి శక్తినిచ్చే ఆహారమే ఆరోగ్యకరమైనది. నాలుకకు రుచిగా, కంటికి ఇంపుగా కనిపించే జంక్‌ఫుడ్ ఎన్నటికీ అనారోగ్యమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తీసుకునే ఆహారం విషయంలో శ్రద్ద తీసుకుంటే ఆరోగ్యకరమైన జీవితం సొంతం అవుతుందని అంటున్నారు. మనం తీసుకునే ఆహారమే ఒత్తిడి, అలసట, నిరుత్సాహం వంటి మూడ్స్‌కి కారణమవుతుందని గమనించారా అని ప్రశ్నిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ ఆహారం కారణంగానే..మన ఒత్తిడి, ఆందోళన బారిన పడి క్రమంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు నిపుణులు. అదెలాగో వారి మాటల్లోనే తెలుసుకుందాం.
మన తీసుకునే ఆహారం కేవలం కేలరీలు మాత్రమే కాదు, శక్తి, మానసిక స్థితి, నిద్ర, ఏకాగ్రత, స్వస్థత వంటి వాటిక మూలం. నిరంతరం అలసటగా, ఉబ్బరంగా, ఆందోళన, నిరుత్సాహం, ఒత్తిడి ఎదురవ్వుతుంటే శరీరం ఆహారాన్నికాదు పోషణను కోరుకుంటుందని అర్థమట. అందుకే శుభ్రమైన ఆహరం తినమని సూచిస్తున్నారు నిపుణులు.
ముఖ్యంగా హైడ్రేటెడ్‌గా ఉండేందుకు ఎక్కువ నీరు తాగమని చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారానికి బదులుగా సహజమైన ఆహారాన్నే ఎంచుకోమని సూచిస్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఆహారంతోనే ఆరోగ్యకరమైన మనస్సు + ఆరోగ్యకరమైన శరీరం అని నొక్కి చెబుతున్నారు. దయచేసి వ్యాధులకు ఆహారం ఇవ్వడం ఆపండి.. స్వస్థతకు ఆహారం ఇవ్వడం ప్రారంభించండి అని కోరుతున్నారు ఆరోగ్య నిపుణులు.
డా. ఆదర్శ గౌడ
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)
AIC-SRS-ICAR-NDRI ఫౌండేషన్, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతి ఆయోగ్)
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం నిపుణుల ఆధారంగా ఇచ్చిన కథనం. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: చేతులతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తి..!)


