మీరు టీవీ చూస్తున్నారా?
మీ టీవీ కూడా మిమ్మల్ని చూస్తోంది..
అన్నీ గమనిస్తోంది.. మీరేం చూస్తున్నారు..
ఏ సినిమా.. ఏ సీరియల్ ఇలా అన్నీ..
అంతేకాదు.. మీ వ్యక్తిగత ఫొటోలు,
ఆస్తి పత్రాలు.. ఇవన్నీ..
చూసి.. ఊరకనే ఉంటోందా? ఎవరికైనా పంపిస్తోందా?
ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
ఇంట్లోనే మనం పెంచి పోషిస్తున్న ఈ డిజిటల్ గూఢచారి సంగతేంటో..
దాంతో సమస్యేంటో తెలుసుకుందాం..
అసలు ఏం జరుగుతోంది?
స్మార్ట్ టీవీల్లో ఉండే ఆటోమేటిక్ కంటెంట్ రికగి్న షన్ (ఏసీఆర్) ఇదంతా చేస్తుంది. చాలా టీవీల్లో ఇది డిఫాల్ట్‌గా ఆన్‌లోనే ఉంటుంది. స్క్రీన్ మీద ఏం ప్లే అవుతోంది? అన్న దాన్ని ఆ దృశ్యాల పిక్సిల్ నమూనాలు లేదా ఆడియో క్లిప్పుల ద్వారా విశ్లేíÙంచి.. మీరు చూస్తున్న దాన్ని గుర్తిస్తుంది. అది ఓటీటీలోని సినిమా కావచ్చు లేదా యూట్యూబ్ వీడియో కావచ్చు. వాటిని ఒక ’డిజిటల్ ఫింగర్ ప్రింట్’గా మార్చి సర్వర్లకు పంపిస్తుంది. ఈ డేటా ఆధారంగా కంపెనీలు యూజర్ల అలవాట్లను విశ్లేíÙస్తాయి. మీకు ఏ రకమైన వస్తువులు లేదా కంటెంట్ ఇష్టమో తెలుసుకుని, అందుకు తగ్గట్టుగా టీవీ స్క్రీన్‌పై ప్రకటనలు కనిపిస్తాయి. ఇది తరచూ జరిగేదే.. కానీ..
అసలు విషయం ఏంటి?
తాజాగా అమెరికాలో వెలువడిన ఓ అధ్యయనం ఏం చెబుతోందంటే.. ఇది టీవీనే కాదు.. టీవీకి ల్యాప్‌టాప్, ఫోన్ కనెక్ట్ చేసి ఏదైనా చూసినా దాన్ని కూడా సేకరిస్తోందని తేలింది. అది కూడా మార్కెట్లో ప్రధాన బ్రాండ్లుగా ఉన్న కొన్ని టీవీ కంపెనీలకు చెందిన పలు మోడళ్లలో ఇది జరిగిందని చెబుతున్నారు. ఏసీఆర్ను ఆన్ చేసినప్పుడు అది స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యే ప్రతిదాన్ని గమనిస్తుందని ప్రైవసీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం అనుకున్నదాని కంటే.. చాలా ఎక్కువగా దాని పరిధి ఉందని అంటున్నారు. ‘చాలా మంది నెట్‌ఫ్లిక్స్ లేదా యూట్యూబ్‌లో ప్రైవసీ సెట్టింగ్‌లు సరిగా పెట్టుకుంటే చాలు అనుకుంటారు. కానీ టీవీలో ఉండే ఈ ఏసీఆర్ కూడా మొత్తం సమాచారాన్ని సేకరిస్తుందన్న విషయం వారికి తెలియదు.
ఇందులో మన వ్యక్తిగత చిత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సున్నితమైన వివరాలు కూడా ఉండొచ్చు’ అని 66 శాట్స్ సైబర్ టెక్ ఎండీ నీహార్ పథేర్ హెచ్చరిస్తున్నారు. ‘చాలా స్మార్ట్ టీవీల్లో ఏసీఆర్ డీఫాల్ట్‌గా ఆన్‌లోనే ఉంటుంది. మనం ఏం చూస్తున్నామన్న సమాచారాన్ని అది థర్ట్ పార్టీలకు పంపే అవకాశమూ ఉందని సైబర్ మీడియా రీసెర్చ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభురామ్ చెప్పారు. అయితే, తాము ఇలాంటి నిఘాలకు దూరమని ఇంటెక్స్ టెక్నాలజీస్ డైరెక్టర్ కేశవ్ బన్సల్ స్పష్టం చేశారు. గూగుల్ టీవీ, ఓటీటీ యాప్స్‌లో ఉండే సమ్మతి విధానాలపైనే తాము ఆధారపడతామని చెప్పారు. పైగా.. ఇంటెక్స్ టీవీలు వాటికి కనెక్ట్ చేసే ల్యాప్‌టాప్, మొబైల్ వంటి వాటిని ట్రాక్ చేయవన్నారు. అలాగే ఏసీఆర్ సమాచారాన్ని తాము డబ్బుల కోసం థర్డ్ పారీ్టలకు అమ్మడం లాంటివి చేయమని తెలిపారు. అయితే, ఈ వివాదంపై మార్కెట్లోని పలు టీవీ బ్రాండ్లు ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టతా ఇవ్వకపోవడం గమనార్హం.
చట్టం ఏం చెబుతోంది?
మన దేశంలో ఉన్న ’డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్’ ప్రకారం.. వినియోగదారుల సమాచారాన్ని సేకరించే ముందు కంపెనీలు అనుమతి తీసుకోవాలి. అయితే, టీవీలోని ఈ ప్రైవసీ నిబంధనలు ఎంత సుదీర్ఘంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. నీరసం వస్తుంది. దీంతో కొత్త టీవీ కొన్నప్పుడు లేదా సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చినప్పుడు.. మనం చదవకుండానే.. కిందకి పోయి.. అంగీకరిస్తున్నాం అన్న బటన్‌పై క్లిక్ చేస్తాం. నిజానికి దానికి అర్థం మనం మొత్తం చదివాం.. అంగీకరిస్తున్నాం అని కాదు.. ముందు టీవీ ఆన్ కావాలి అదీ మన టార్గెట్. అయితే, విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ఇప్పటికే ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. సరైన సమ్మతి తీసుకోకుండా సమాచారం సేకరించినందుకు అక్కడి లీడింగ్ స్మార్ట్ టీవీ బ్రాండ్ వీజియోపై అధికారులు చర్యలు తీసుకున్నారు. యూరప్‌లోనూ ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు.
మనమేం చేయాలి?
ఈ నిఘాను ఆపడం మన చేతిలోని పనే. టీవీ సెట్టింగ్స్‌లో ఉండే వ్యూయింగ్ డేటా లేదా ఇంటర్నెట్ బేస్డ్ అడ్వరై్టజింగ్ వంటి ఆప్షన్లను వెంటనే ఆపివేయండి. అమెజాన్ ఫైర్ టీవీలో అయితే ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్తే.. ఆటోమెటిక్ కంటెంట్ రికగి్నషన్ను ఆఫ్ చేయాలి. ఇది ఒక్కో టీవీలో ఒక్కోలా ఉండొచ్చు. దాన్ని గుర్తించి ఆఫ్‌లో పెట్టుకుంటే చాలు. అప్పుడు టీవీని మనం చూస్తాం.. టీవీ మాత్రం మనల్ని చూడదు.
మీరేది చూసినా.. ఆ సమాచారాన్ని సేకరిస్తున్న ఏసీఆర్ సాంకేతికత..
ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు కనెక్ట్ చేస్తే.. ఆ సమాచారం కూడా.. వ్యక్తిగత ఫొటోలు, ఆర్థిక లావాదేవీల పత్రాలు వంటివి కూడా..
థర్డ్ పార్టీలకు వ్యక్తిగత సమాచారం విక్రయం? నిపుణుల ఆందోళన


