భారతదేశంలో వేసవికాలం అంటేనే నోరూరించే ఆవకాయ పట్టే కాలం. పచ్చి మామిడికాయల ఘాటైన పుల్లదనం, తాజాగా దంచిన మసాలాల సహజమైన తీక్షణత, ఆ మిశ్రమంపై పోసే వేడి నూనె స్పష్టమైన, గాఢమైన సువాసన మనందరి పాకశాస్త్ర జ్ఞాపకాలను నిర్వచిస్తాయి. తరతరాలుగా, సాంప్రదాయ రుచితో ఎక్కువ కాలం నిల్వ ఉండే ఊరగాయ రహస్యం పూర్తిగా నూనె ఎంపికలోనే ఉందని అమ్మమ్మలు చెబుతుంటారు.
సున్నితమైన గింజల రుచితో కూడిన వేరుశెనగ నూనె ఒక వైవిధ్యమైన పాకశాస్త్ర విజేత, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో శక్తివంతమైనది. పైగా వంటకాలకు మరింత రుచిని అందించేది.
ఇక్కడ వేరుశెనగ నూనె సహజ నిల్వకారిగా, రుచిని పెంచేదిగా పనిచేస్తుంది. ఇది తేలికపాటి సువాసనను, సహజ యాంటీఆక్సిడెంట్లను కలిగివుంటుంది. దాంతో ఊరగాయ ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి సహాయపడుతుంది. దీన్ని గాలి చొరబడని విధంగా మూత వేసి ఉంచితే..బూజు పట్టకుండా, పాడవకుండా నివారిస్తుంది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో మామిడి కాలంలో, సాంప్రదాయ ‘అమ్మమ్మ’ వంటకాలతో ఊరగాయ తయారు చేయడం ఒక ఆచారం. ఇది కుటుంబాలను ఒకచోట చేర్చి, ఆ సంప్రదాయాన్ని పునరుజ్జీవింపజేసి, పాత జ్ఞాపకాలలో మునిగిపోయేలా చేస్తుంది. సాంప్రదాయ తెలుగు/కన్నడ కుటుంబాలలో ఊరగాయ తయారీ అనుభవం గురించి జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్పి. చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ, ఫ్రీడమ్ డబుల్ ఫిల్టర్డ్ వేరుశెనగ నూనెను జాగ్రత్తగా ఎంపిక చేసిన వేరుశెనగల నుంచి తీసి, రెండుసార్లు ఫిల్టర్ చేయడం జరుగుతుంది.
కాబట్టి ఈ అధిక నాణ్యత గల, శుద్ధి చేసిన నూనెను ఎంచుకోవడం ద్వారా, భారతీయ నిల్వ పద్ధతుల ప్రాచీన జ్ఞానాన్ని గౌరవిస్తూనే, మీ కుటుంబానికి స్వచ్ఛమైన, పోషకాలు అధికంగా ఉన్న, గాఢమైన సువాసనతో కూడిన వేసవి మధుర జ్ఞాపకాలను అందివ్వగలరని అంటున్నారు.
(చదవండి: 60 ఏళ్ల తల్లి వెయిట్‌లాస్ స్టోరీ..! దెబ్బకు థైరాయిడ్, షుగర్..)


