"సమోసా" అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ఈ చిరుతిండి బయటకు కరకరలాడుతూ..లోపల కారంగా స్పైసీగా ఉంటుంది. వీధి ధుకాణాలలో ప్రధాన స్నాక్స్ ఐటెం ఇది. వేడి వేడి టీ తోపాటు ఒక్క సమోసా తింటే అబ్బా ప్రాణం లేచొచ్చినట్లు అనిపిస్తుంది. అలాంటి ప్రజాదరణ కలిగిన ఈ వంటకం మన భారతదేశానికి చెందిన వంటకం కాదట. ఇది ఎక్కడ నుంచి వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.
ఈ సమోస మూలాలకు సంబంధించిన కథ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సమోసా స్టోరీ గురించి చరిత్ర, పురావస్తు శాస్త్రలలో పీహెచ్‌డీ చేసిన పరిశోధకుడు, రచయితగా చెప్పుకునే డాక్టర్ ఎంఎఫ్ ఖాన్ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఆయన తన పోస్ట్‌లో సమోసా మెదట ఎలా ఉండేది, మన పాకనిపుణులను దాని తయారీని ఎలా మార్చారు వంటి వాటి గురించి సవివరంగా రాసుకొచ్చారు. 1500..1510ల మధ్య రాసిన పర్షియన్ తాళప్రత్రం గ్రంథలో దీని గురించి సవివరంగా రాసి ఉందని చెబుతున్నాడు.
ఈ గ్రంథం ఆధారంగా అత్యధికంగా తినే వీధి ఆహారమైన సమోసా 500 ఏళ్ల నాటి వంటకంగా పేర్కొన్నాడు. బ్రిటీష్ మ్యూజియంలో ఉన్న ఈ తాళపత్ర గ్రంథంలో పర్షియన్ భాషలో ఈ సమోసా వంటకం గురించి రాసి ఉందని తెలిపాడు. ఈ చిరుతిండి అప్పట్లో చాలా భిన్నమైన రూపాన్ని కలిగి ఉండేదని చెప్పాడు. నాటి పూర్వీకులు ఈ వంటకాన్ని కాల్చిన వంకాయ గుజ్జు, ఎండు అల్లం, గొర్రె మాంసం, వంటివి నూనెల వేయించి..దాన్ని లోపలి స్టఫ్‌గా పెట్టి వండేవారని పేర్కొన్నాడు.
కానీ మనం ప్రస్తుతం చూసే సమోసాలు అందుకు చాలా విభిన్నం. ఇప్పుడు వాటిల్లో బంగాళదుంపలు, ఉల్లిపాయల కూర వంటివి స్టఫ్‌గా పెట్టి వండేస్తున్నాం. పైగా జతగా వేయించిన పచ్చిమిర్చి ఇస్తుంటాం. నిజానికి అప్పుడు ఇలా ఈ రెండూ ఉండేవి కావని అన్నారు. ఆ తాళ్లపత్రాల ఆధారంగా మొఘల్ చక్రవర్తి అక్బర్, టిప్పు సుల్తాన్ చేతుల మీదుగా ప్రయాణించి..మన దేశంలోకి వచ్చిందని చెప్పారు.
వీధి చిరుతిండిగా దొరకక ముందు నాటి సమోసా ఇది.. అని అన్నారు. అంటే ఇది రాజరికపు వంటకంగా మొదలై వీధి దుకాణపు ఫేమస్ స్నాక్స్ ఐటెంగా మారిందని చెప్పుకొచ్చారు. నెటిజన్లు ఈ పోస్ట్‌ని చూసి..అంటే ఈ సమోసా మన దేశంలోకి వలస వచ్చిందన్న మాట అని హాస్యస్పదంగా పోస్టులు పెట్టారు.
మితంగానే మంచిది..
ఆరోగ్య నిపుణుల మాటల ప్రకారం.. సమోసాలో అధిక మొత్తంలో నూనె, చక్కెర స్థాయిలు ఉంటాయనేది వాస్తవం. వీటిని మోతాదుకు మించి తీసుకుంటే అనారోగ్యానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి. ఒక సమోసాలో 11 నుంచి 12 గ్రాముల ఆయిల్ ఉంటుందని అంచనా. ఇలాంటి ఆహార పదార్థాలు రోజూ తింటే..ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు
The samosa is one of the most eaten street foods on the planet. This is a 500-year-old recipe for it, written in Persian in a manuscript sitting in the British Museum.
The manuscript is called the Ni'matnama, the Book of Delights, written between 1501-1510 AD, for the Sultan of… pic.twitter.com/uEjIe77zQl— Dr. M.F. Khan (@Dr_TheHistories) April 8, 2026
(చదవండి: నాడు సాధారణ తోపుడు బండి వ్యాపారం..! కట్‌చేస్తే..)


