పిల్లల డ్రీమ్‌ హౌజ్‌..! | The Way To Teach Imagination, Responsibility And Decoration In Children | Sakshi
Sakshi News home page

పిల్లల డ్రీమ్‌ హౌజ్‌..!

May 28 2026 1:14 PM | Updated on May 28 2026 1:26 PM

The Way To Teach Imagination, Responsibility And Decoration In Children

పిల్లలతో ఊహాశక్తి, బాధ్యత, అలంకరణ పట్ల అభిరుచిని పెంచేది వారి డ్రీమ్‌ హౌస్‌. అందులో గోడలు, ఫర్నిచర్, వాతావరణం.. ప్రతిదీ పరిచయం చేయవచ్చు. పిల్లల్లో వచ్చే సృజనాత్మక ఆలోచనలకు మీరే ఆశ్చర్యపోతారు.

వెల్‌కమ్‌ చెప్పే డోర్‌..
మన ఇంటి తలుపు ఎప్పుడూ శుభ్రంగా, అందంగా, ఆకర్షణీయంగా ఆహ్వానించేలా ఉండాలి. దాంతోపాటు మెయిన్‌ డోర్‌ ఎలా ఉండాలో చూపమనండి.

లివింగ్‌ – డైనింగ్‌..
కుటుంబ సభ్యులు కలిసి కూర్చొని ఆనందించే ప్రదేశం, అందరూ కలిసి భోజనం చేసే చోటు ఎలా ఉంటే వారికి నచ్చుతుందో చెప్పమనవచ్చు. గది గోడల రంగు, లైటింగ్, వాల్‌ పేపర్స్‌ .. ఇలా ప్రతిదీ క్రియేటివ్‌గా వారి మైండ్‌లో నుంచి వచ్చినదై ఉండాలి. రంగులు మన మూడ్‌ను ఏ విధంగా మార్చుతాయి... ఎక్కువ వస్తువులు కాకుండా ఇంటిని నీటుగా ఎలా సర్దుకోవడం, ప్రతి వస్తువు ఉపయోగం.. ఇలా ప్రతిదీ పాఠమే అవుతుంది.

‘పిల్లలను ఇంటి బొమ్మ డ్రా చేయమని సాధారణంగా అడుగుతుంటాం. వాళ్లు ఒక ఇంటి రూపాన్ని డ్రాయింగ్‌ చేసి చూపుతారు. దీనివల్ల పిల్లల్లో క్రియేటివిటీ అక్కడితో ఆగిపోతుంది. అలా కాకుండా వారి డ్రీమ్‌ హౌజ్‌.. దానితో పాటు కిచెన్, బెడ్‌రూమ్, లివింగ్, స్టడీ రూమ్, రంగులు, ఆర్కిటెక్చర్, అలంకరణ, ఇండోర్‌– ఔట్‌డోర్‌ మొక్కలు... ఇలా ఇంటికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఎలా ఉండాలో చెప్పమనవచ్చు. డ్రా చేసి చూపమనవచ్చు. ఇల్లు.. పిల్లల్లో ఎన్నో క్రియేటివ్‌ ఐడియాలకు రూపకల్పన ఇస్తుంది. వారి క్రియేటివ్‌ ఐడియాలను మాకు పంపించండి. మెయిల్‌ ఐడి : sakshisummerkids@gmail.com

- గీతాభాస్కర్, నటి, ఆర్ట్‌ టీచర్‌

బెడ్‌రూమ్‌ – చదువుకునే ప్లేస్‌
పిల్లల గది ఆలోచనల పుట్టకు ప్రతిరూపం అని చెప్పవచ్చు. శుభ్రంగా, ప్రశాంతంగా ఉండాలి. వాళ్ల చెప్పిన విధానం, డ్రాయింగ్‌లో చూపిన విధానం.. వారికి పదే పదే గుర్తుకు వస్తుంది. దీని వల్ల గదులను శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు అవుతుంది. కాంతి ఎక్కువగా, ప్రశాంతంగా ఉండాలి. ప్రతిరోజూ ఒకే దగ్గర, ఒకే సమయంలో చదువుకోవడం అలవాటుగా మార్చుకుంటే ఏకాగ్రత క్రమశిక్షణ అలవడతాయి. రీడింగ్‌ ప్లేస్‌ను ఎలా ఉంచుకోవాలో బాధ్యత పెరుగుతుంది.

మొక్కలు – అలంకరణ..
ఇండోర్‌ ΄్లాంట్స్‌ అమర్చితే ఇల్లు జీవకళతో ఆకట్టుకుంటుంది. ప్రకృతిపట్ల ప్రేమ పెరుగుతుంది. ఇంటి లోపల పెంచే మొక్కలు ఎన్ని రకాలు, వాటికి గాలి, వెలుతురు, నీరు .. ఎంతవరకు అవసరమో తెలుసుకుంటారు. మన జీవనానికి ఉపయోగపడే వాటి గురించి కొత్తగా ఆలోచించగలుగుతారు.

‘నీ గది ఎలా ఉండాలని అనుకుంటావు? ఏ రంగు అయితే బాగుంటుంది?’, ‘‘పుస్తకాలను ఎలా సెట్‌ చేద్దాం?,’ ‘చిన్నమొక్కలు ఎక్కడ పెడతావు..’ ఇలా అడిగితే వాళ్లు తమ చిన్న చేతులతోనే చేసి చూపుతారు. ప్రేమ, పరిశుభ్రత, ప్రశాంతత ఉన్న ఇల్లు నిజమైన డ్రీమ్‌ హౌస్‌ అంటూ ఒక వ్యాసం రాసి చూపమనవచ్చు.
నిర్వహణ : నిర్మలా రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement