క్యాన్సర్‌ నివారణకు పసుపు ఉపయోగపడుతుందా?.. అదే అడ్డంకి..

Turmeric Can Help Teat Cancer Is It True Know The Facts - Sakshi

ప్రాచీనకాలం నుంచి పసుపు మన జీవితాలతో ముడిపడి ఉంది. తాపనివారణ నుంచి యాంటీ ఆక్సిడెంట్స్‌ వరకు దీనిలోని ఔషధగుణాలను శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు. ఏదిఏమైనప్పటికీ దీని ప్రయోజనాలు లెక్కకుమించి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఐతే తాజాగా వివిధ రకాల క్యాన్సర్‌లకు చికిత్స చేయడానికి, వ్యాధి తీవ్రతను తగ్గించడంలో పసుపు ఏ విధంగా ప్రభావం చూపుతుందనే అంశంపై అనేక పరిశోధన అధ్యయనాలు దృష్టి సారించాయి. దీర్ఘకాలిక తాపం, క్యాన్సర్ అభివృద్ధికి మధ్య సహసంబంధం ఉన్నందువల్ల, పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు వ్యాధితో పోరాడడంలో ప్రయోజనకరంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

చదవండి: The Singing Ringing Tree: ఈ చెట్టు మధురంగా పాడుతుందట..!.. వినాలంటే..

2019లో న్యూట్రియంట్స్‌ అనే సైంటిఫిక్‌ జర్నల్‌ ప్రచురించిన నివేధికలో కూడా.. పసుపు రొమ్ము క్యాన్సర్ కణాల విస్తరణను నిరోధిస్తుందని, కణితి పెరుగుదల మందగించేలా ప్రేరేపిస్తుందని పేర్కొంది. అంతేకాకుండా ఊపిరితిత్తులు, పెద్దపేగు, క్లోమ.. వంటి  కొన్ని ఇతర రకాల క్యాన్సర్లకు చికిత్సగా పసుపును వినియోగించడంపై పరిశోధనలు జరుగుతున్నాయని తెల్పింది. ఇప్పటికీ పరిశోధనల ఫలితాలు ఒక కొలిక్కిరాన్పటికీ, టెస్ట్ ట్యూబ్, జంతు అధ్యయనాల్లో మంచి ఫలితాలు వచ్చినట్లు ఈ నివేదిక తెల్పింది.

చదవండి: పాపం.. ఒంటరైన తిమింగలం..తలను గోడకేసి బాదుకుని..!

క్యాన్సర్ చికిత్సలో పసుపును ఉపయోగించడంలో అతిపెద్ద అడ్డంకి ఏంటంటే.. పసుపును ఎక్కువ మోతాదులో మానవ శరీరం  గ్రహించలేకపోవడం. ఈ అడ్డంకిని అధిగమించడానికి ఫార్మకాలజిస్టులు కృషి చేస్తున్నారు. ఐతే ఈ పరిశోధనలు విజయవంతం అయ్యే వరకు... పసుపును క్యాన్సర్‌కు చికిత్సగా ఉపయోగించడం కుదరదు. 

చదవండి: Foods For Bone Health: అరటి, పాలకూర, డ్రై ఫ్రూట్స్‌, చేపలు, బొప్పాయి.. ఇవి తింటే..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top