Tourist Spot: కొత్తదంపతులు ఈ దేవాలయాన్ని తప్పక దర్శించుకుంటారు..

Tourism Guide Komuravelli Mallikarjuna Swamy Temple Uniqueness - Sakshi

స్వయంబువుగా వెలిసిన కొమురెల్లి మల్లన్న స్వామి భక్తుల కొంగు బంగారం. చందమామలాంటి  బిడ్డనిచ్చి ఒడినింపుతాడని నమ్మకం. మల్లన్నకు ఉయ్యాల కడితే ఇంట్లో ఉయ్యాల ఊగుతుందని విశ్వాసం. అందుకే... ఉయ్యాల కట్టి మరీ మల్లన్నకు మొక్కుతారు.

నూతన దంపతులు కొమురెల్లి మల్లన్నను దర్శించుకుంటే పండండి బిడ్డ నట్టింట నడయాడుతుందని నమ్ముతారు భక్తులు. మంచిర్యాల జిల్లా, జైపూర్‌ మండలం కుందారం గ్రామంలో కొలువైన స్వయంభువు కొమురెల్లి మల్లన్న. కడుపు పండాలని మల్లన్నకు మొక్కి, కొత్త గుడ్డలో కొబ్బరికాయను కట్టి చెట్టుకు వేళ్లాడదీస్తారు. ఈ ఆలయంలోని చెట్ల కొమ్మలు నిండుగా ఈ ఉయ్యాలలే కనిపిస్తాయి. కుందారం గ్రామంలో పదేళ్ల కిందట కాకతీయుల కాలం నాటి కొమురెల్లి మల్లన్న విగ్రహాలు బయటపడ్డాయి. అప్పటి నుంచి ఈప్రదేశం పెద్ద యాత్రాస్థలంగా మారింది. కార్తీకమాసం మొదలైంది. ఇక శివుని కోవెలలన్నీ దీపాలతో కళకళలాడుతుంటాయి. ఈ టూర్‌లో శివ్వారంలోని మొసళ్ల మడుగును కూడా కవర్‌ చేయవచ్చు. 

– వేముల శ్రవణ్‌కుమార్, సాక్షి, మంచిర్యాల 

చదవండి: ఈ సరస్సుకు వెళ్లినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు!.. మిస్టీరియస్‌..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top