
గోవా ప్రాన్స్ రిషాయిడో
కావలసినవి: రొయ్యలు– ఒక కప్పు (శుభ్రపరిచి హాఫ్ బాయిల్ చేçసుకోవాలి)
ఉల్లిపాయ– ఒకటి (చిన్నది, తరిగినది)
పాలు– అర కప్పు
ఉప్పు, మిరియాల పొడి– రుచికి తగినంత
మైదాపిండి– ఒక కప్పు పైనే
నీళ్లు, నూనె– సరిపడా
గుడ్లు– 2 (పగలగొట్టి, కొద్దిగా పాలల్లో కలిపి పెట్టుకోవాలి)
బ్రెడ్ పౌడర్– ఒక కప్పు
తయారీ: ముందుగా కళాయిలో కొద్దిగా నూనె వేసుకుని; ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేగిన తర్వాత రొయ్యలు, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసుకుని; మూతపెట్టి చిన్నమంట మీద బాగా కుక్ చేసుకోవాలి. ఈలోపు మైదాపిండిలో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని ముద్దలా చేసుకుని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి.
ఇప్పుడు ప్రతి ఉండను పూరీలా ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి. రొయ్యల మిశ్రమం బాగా ఉడికిన తర్వాత కాస్త చల్లారనిచ్చి, కొద్దికొద్దిగా పూరీల్లో నింపుకుని చిత్రంలో చూపిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. వాటిని గుడ్లు, పాల మిశ్రమంలో ముంచి, బ్రెడ్ పౌడర్ పట్టించి నూనెలో దోరగా వేయించుకోవాలి.
సొరకాయ మంచూరియా
కావలసినవి: సొరకాయ తురుము– 1 కప్పు
మైదాపిండి– 4 టేబుల్ స్పూన్లు, కార్న్ పౌడర్– 1 టేబుల్ స్పూన్ , గోధుమపిండి– 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్– అర టీ స్పూన్, కారం– 1 టీ స్పూన్ , జీలకర్ర– అర టీ స్పూన్ , ఉల్లిపాయ ముక్కలు– 1 టేబుల్ స్పూన్ (చిన్నగా తరగాలి), పచ్చిమిర్చి– 1 (చిన్నగా తరగాలి), కొత్తిమీర తురుము, కరివేపాకు– కొద్ది కొద్దిగా (అభిరుచి బట్టి), ఉల్లికాడ ముక్కలు– కొద్దిగా, టమాటో సాస్– 3 లేదా 4 టేబుల్ స్పూన్లు, చిల్లీ సాస్– 2 టీ స్పూన్లు, సోయా సాస్– 1 టీ స్పూన్ , నూనె– సరిపడా, ఉప్పు– తగినంత
తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని; అందులో సొరకాయ తురుము, మైదాపిండి, కార్న్ పౌడర్, గోధుమపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కారం వేసి బాగా కలపాలి. మరీ పొడిగా ఉంటే కాస్త నీళ్లు కలపొచ్చు. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని, నూనెలో దోరగా వేయించుకోవాలి. తర్వాత మరో కళాయి తీసుకుని; అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని; ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి.
అందులో చిల్లీ సాస్, టొమాటో సాస్, సోయా సాస్, కొత్తిమీర తురుము, కరివేపాకు వేసి కలపాలి. ముందుగా వేయించుకున్న మంచూరియాలను అందులో వేసి నిమిషం పాటు వేయించాలి. తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకుని, ఉల్లికాడ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి.
పికిల్డ్ కుకుంబర్
కావలసినవి: కీర దోసకాయలు– 3 లేదా 4 మధ్యస్థ పరిమాణంలో
వెల్లుల్లి– 2 రెబ్బలు (సన్నగా తరగాలి)
అల్లం– ఒక చిన్న ముక్క (సన్నగా తురుముకోవాలి)
సోయా సాస్, వెనిగర్– 2 టేబుల్ స్పూన్లు చొప్పున
నువ్వుల నూనె– ఒక టీ స్పూన్
చిల్లీ ఫ్లేక్స్– అర టీస్పూన్
పంచదార పొడి– ఒక టీస్పూన్
పుల్లలు– 2–3
తయారీ: ముందుగా కీర దోసకాయలను శుభ్రంగా కడిగి, చివరలను కట్ చేసుకోవాలి. ఇప్పుడు పై చిత్రంలో ఉన్న విధంగా కీర దోసకాయల తొక్కతీసి, కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిపై ఉప్పు జల్లి పది నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత దోసకాయలను చల్లటి నీటితో శుభ్రంగా కడిగి, పొడిగా తుడవాలి.
ఈలోపు ఒక గిన్నెలో సన్నగా తరిగిన వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్, సోయా సాస్, వెనిగర్, నువ్వుల నూనె, పంచదార వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని బ్రష్‌తో కీరాలకు పూయాలి. ఇప్పుడు వాటిని ఒక గంట పాటు ఫ్రిజ్‌లో ఉంచి, సర్వ్ చేసుకునే ముందు వాటికి పుల్లలు గుచ్చి సర్వ్ చేసుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది.
(చదవండి: ఈ చిరుజల్లుల్లో టేస్టీ టేస్టీ స్నాక్స్ చేసేద్దాం ఇలా..!)