నా ప్రార్థనను ఎందుకు మన్నించవు? 

Sri Kalahastiswara Satakam Devotional Story Telugu - Sakshi

శ్రీకాళహస్తీశ్వర శతకం

నిను నావాకిలి గావుమంటినొ? మరున్నీలాలక భ్రాంతి గుం         
టెన పొమ్మంటినొ, యెంగిలిచ్చితిను తింటేగాని కాదంటినో    
నిను నెమ్మిందగ విశ్వసించు సుజనానీకంబు రక్షింప చే           
సిన నావిన్నపమేల గైకొనవయా శ్రీకాళహస్తీశ్వరా! 

భావం: శ్రీకాళహస్తీశ్వరా! నా యింటిని కావలి కాయమని నిన్ను  కోరానా? నిన్ను రాయబారిగా వెళ్లమన్నానా?నేను తిన్న ఎంగిలిపదార్థాన్ని నీకు పెట్టి,‘తింటావా? లేదా?‘అని, నిన్ను తొందర చేశానా? నిన్ను నమ్మిన మంచివాళ్లైన నీ భక్తులను రక్షించమని నేను వేడితే, నా ప్రార్థనను ఎందుకు మన్నించవు? 

ఱాలన్‌ రువ్వగ చేతులాడవు, కుమారా! రమ్మురమ్మంచు నే –
చాలన్‌ చంపగ, నేత్రముల్దివియగా శక్తుండనేగాను, నా 
శీలంబేమని చెప్పనున్న దిక  నీ చిత్తంబు, నా భాగ్యమో 
శ్రీలక్ష్మీపతి సేవితాంఘ్రియుగళా! శ్రీకాళహస్తీశ్వరా!      
         

భావం: శ్రీమన్నారాయణునిచే పూజించబడు శ్రీకాళహస్తీశ్వరా! ఆ బోయవానిలా పూజ చేసేందుకు నీపై రాళ్లు విసర లేను. రమ్మని పిలిచి, కన్న కొడుకును చంపలేను. నా కన్నులను ఊడబెరికి ఇవ్వలేను. నా గురించి ఇంకా నేనేం చెప్పాలి? ఇక నీదయ!!! నా భాగ్యం!!!           

-తెలుగు తాత్పర్యం: టేకి వీరబ్రహ్మం

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top