వింత పండు: కొమ్ముల దోసకాయ | The Specialty Of The African Horned Cucumber And Taste | Sakshi
Sakshi News home page

వింత పండు: కొమ్ముల దోసకాయ

May 30 2026 11:01 AM | Updated on May 30 2026 11:01 AM

The Specialty Of The African Horned Cucumber And Taste

వింత పండు

పిల్లలూ... మనం తినే దోసకాయ ఆకుపచ్చగా, నున్నగా ఉంటుంది కదా. కానీ ఆఫ్రికాలో ఒక దోసకాయ ఉంది. దాన్ని చూస్తే ‘అమ్మో గ్రహాంతరవాసి’ అని పరిగెత్తుతారు. పేరు ‘కివానో’. ముద్దు పేరు ‘కొమ్ముల మెలన్‌’ లేదా ‘జెల్లీ మెలన్‌’. ఇది మన దేశంలో అస్సలు దొరకదు.

కివానో పసుపు, నారింజ రంగులో ఉంటుంది. దాని ఒంటి నిండా కొమ్ముల్లాంటి ముళ్లు ఉంటాయి. పైన గట్టిగా ఉన్నా లోపల మాత్రం పచ్చటి జెల్లీ ఉంటుంది. దాన్ని సగానికి కోస్తే అరటి, కీరదోస, నిమ్మరసం కలిపినట్టు వాసన వస్తుంది. గరిటెతో గీకితే జెల్లీ లాంటి గుజ్జు వస్తుంది. అందులో దోస గింజల్లాంటి చిన్న గింజలు తేలుతూ ఉంటాయి. ఆ గింజలతో సహా తినేయ్యచ్చు. రుచి మాత్రం పుల్లగా, తియ్యగా, ఉప్పగా, మూడూ కలిపినట్టు ఉంటుంది. ఆఫ్రికా పిల్లలు ఎండాకాలంలో దీన్ని లాగించేస్తారు.

కివానో అసలు ఇల్లు కలహారి ఎడారి. దక్షిణ ఆఫ్రికా, బోట్సా్వనా, నమీబియా దేశాల్లో ఇది విపరీతంగా పెరుగుతుంది. ఎడారిలో నీళ్లు దొరకనప్పుడు అక్కడి జంతువులు, మనుషులు దీన్ని తిని దాహం తీర్చుకుంటారు. దీంట్లో 90% నీరే ఉంటుంది. అందుకే దీన్ని ‘ఎడారి వాటర్‌ బాటిల్‌’ అంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement