మండే ఎండల్లో జొన్న అంబలి.. ఒంటికి చలవ | Sorghum or Jowar Ambali and health benefits in summer season | Sakshi
Sakshi News home page

మండే ఎండల్లో జొన్న అంబలి.. ఒంటికి చలవ

Apr 11 2026 12:55 PM | Updated on Apr 11 2026 1:08 PM

Sorghum or Jowar Ambali and health benefits in summer season

వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక అద్భుత పానీయం జొన్న అంబలి. ఇది శరీరానికి చలువ చేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అలసటను తగ్గించి తక్షణ శక్తిని అందిస్తుంది, అలాగే మలబద్ధకం, డీహైడ్రేషన్‌ సమస్యలకు అద్భుతమైన నివారణ. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. 

తయారీ  ఎలా అంటే..!

ముందుగా రెండు స్పూన్ల జొన్న పిండిని తీసుకుని నీళ్లలో ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీళ్లు పోసి బాగా మరిగించాలి. ఈ నీటిలో ముందుగా కలుపుకున్న పిండిని వేసి చిక్కబడేవరకు 5 నుంచి 10 నిమిషాల పాటు గరిటతో తిప్పుతుండాలి. చివరగా సరిపడా ఉప్పువేసుకుంటే అంబలి రెడీ అవుతుంది. అంబలి మరింత రుచిగా ఉండాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి డైట్‌. ఇది తాగిన తర్వాత కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించి, త్వరగా ఆకలివేయదు.  

ఇదీ చదవండి : 75 హార్డ్ ఛాలెంజ్: బోహో గర్ల్ కృతిక వెయిట్‌ లాస్‌ జర్నీ

Advertisement
 
Advertisement
Advertisement