నా రూటు... సపరేటు... | Is this the SMARTEST DOG in the World? | Sakshi
Sakshi News home page

నా రూటు... సపరేటు...

May 2 2026 11:54 AM | Updated on May 2 2026 11:55 AM

Is this the SMARTEST DOG in the World?

సిటీ బస్‌ ఎక్కి తిరగాలంటే మనమే అప్పుడప్పుడు కన్‌ఫ్యూజ్‌ అవుతుంటాం. అమెరికాలోని ఈ కుక్క మాత్రం కరెక్టుగా కావాల్సిన బస్సు ఎక్కి కావాల్సిన చోటులో దిగిపోతుంది. సంగతి వినండి. సియాటిల్‌ నగరంలో ఉండే ఈ కుక్క పేరు ఎక్లిప్స్‌. అది రోజూ ఓనర్‌తో ΄ాటు బస్సెక్కి డాగ్‌ పార్క్‌కి వెళ్లేది. అక్కడ తోటి కుక్కలతో ఆడుకునేది. దానికి చాలామంది ఫ్రెండ్స్‌ ఉన్నారు. ఒకరోజు ఓనర్‌ లేట్‌ అయ్యాడు. ఎక్లిప్స్‌కు విసుగొచ్చింది. 

అసలే అక్కడ ఫ్రెండ్స్‌ వెయిటింగ్‌. ఓనర్‌ లేకపోతే ఏముందిలే నాకు దారి తెలుసుగా అని ఒక్కతే బస్‌స్టాప్‌కి వెళ్లి బస్‌ ఎక్కేసింది. డ్రైవర్‌కి తన మెడలో ఉన్న సీజన్‌ కార్డు చూపించింది. కరెక్ట్‌ స్టాప్‌లో దిగి పార్క్‌కి వెళ్లి ఆడుకుంది. తర్వాత ఇంటికి వెళ్లే బస్‌ ఎక్కి వచ్చేసింది. ఓనర్‌ మొదట ఆశ్చర్యపోయినా ఇదే బెటరని వదిలేశాడు. అప్పటి నుంచి ఎక్లిప్స్‌ రోజూ సొంతంగా బస్‌లో పార్క్‌కి వెళ్తుంది. బస్‌ డ్రైవర్లందరికీ ఎక్లిప్స్‌ ఫ్రెండ్‌ అయిపోయింది. పాసింజర్లు దానితో సెల్ఫీలు దిగుతారు. ఎక్లిప్స్‌కి రూట్‌ నంబర్, స్టాప్‌ బాగా తెలుసు. ఒక్కసారి కూడా స్టాప్‌ మిస్‌ అవ్వలేదట.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement