
క్రియేటివిటీ ఉంటే..అద్భుతాలకు కొదువు ఉండదు. కాస్త టాలెంట్‌కి సృజనాత్మకత తోడైతే..ఎన్నో గొప్ప ఆవిష్కరణలు ఆవిష్కృతమవుతాయి. అందుకు ఉదాహారణే ఈ చీరల దుకాణంలోని సరికొత్త తీరు ప్రకటన. ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందో గానీ ఐడియా మాత్రం అదిరిపోయింది.
బెంగళూరులోని ఒక చీరల దుకాణం చాట్‌జీపీటీ శైలి చాట్‌బాట్ మాదిరిగా అడ్వర్టైస్‌మెంట్ అందరిన్నీ తెగ ఆకట్టుకుంటోంది. అ‍్కడ స్టోర్‌లో చాట్ జీపీటీ శైలిలో ఒక డిస్‌ప్లేని ఏర్పాటు చేశారు. అది వరమహాలక్ష్మీ పండుగను ఎందుకు చేసుకుంటారనే దాని గురించి వివరిస్తుంది. ఈ విధానం కస్ట్‌మర్‌లకు ఆసక్తిని రేకెత్తించేలా తెగ ఆకట్టుకుంటుంది.
చివరగా అది దక్షిణ భారతదేశంలోని వివాహిత మహిళలు సంతానం, విజయం, ధన కనక వస్తు వాహనాలు సిద్ధించాలని లక్ష్మీ దేవిని పూజించే పండుగే ఇది అని పండుగ ప్రాముఖ్యత గురించి వివరిస్తుంది. వరమహాలక్ష్మీ పండుగకు ముందు ఇలా చీర దుకాణంలో ఏర్పాటు చేసిన తీరు కస్టమర్లను ఆకట్టుకునే సరికొత్త ట్రిక్కుగా పలువురు వ్యాఖ్యానించారు.
అయితే ఇలా బెంగళూరు స్థానిక చీరల దుకాణంలో చాట్‌జీపిటీ మొబైల్ ఇంటర్‌ఫేస్‌ని ఉపయోగించడం మాత్రం ఇదే తొలిసారి. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం బెంగళూరు ప్రజల రోజువారీ జీవితంలో సాంకేతికత ఎలా మిళితం అవుతుందో స్పష్టంగా తెలుస్తోందని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. కాగా ఈ వరలక్ష్మీ వ్రతాన్ని దక్షిణి భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఘనంగా జరుపుకుంటారు. దీనిని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకుంటారు.
Local saree shop in Bangalore using ChatGPT mobile interface for an ad is a first.
Earlier it would be the Google search bar design.
Just Bangalore things I guess. pic.twitter.com/TA5664tJAs— Osborne Saldanha (@os7borne) August 5, 2025
(చదవండి: Sravana Sukravaram‘శ్రావణ లక్ష్మీ రావే మా ఇంటికి’...సెల్ఫీ షేర్ చేయండి!)
(చదవండి: స్ట్రీట్‌లైట్ ఆంటీ': భద్రతకు వెలుగుగా నిలిచింది..!)