Green Amla Juice: డయాబెటిస్‌ను అదుపులో ఉంచే గ్రీన్‌ ఆమ్ల జ్యూస్‌.. బీపీ క్రమబద్ధం చేసే డ్రింక్‌!

Recipes In Telugu: How To Make Green Amla Juice Honey Amla Drink - Sakshi

గ్రీన్‌ ఆమ్ల... హనీ ఆమ్ల... ఆరోగ్యసిరినిచ్చే ఉసిరి తింటే వచ్చే ప్రయోజనాలెన్నో... ఆ అన్నింటిలో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి వంటిల్లూ ఉసిరి సంపదలతో విలసిల్లాలి మరి!

గ్రీన్‌ ఆమ్ల జ్యూస్‌ 
కావలసినవి :
►ఉసిరికాయలు– 3 లేదా నాలుగు (సైజ్‌ని బట్టి)
►అల్లం – అర అంగుళం ముక్క
►నీరు– 200 మిల్లీ లీటర్లు
►ఉప్పు– చిటికెడు
►నిమ్మరసం– టీ స్పూన్‌.

తయారీ:
►అల్లం, ఉసిరికాయలను తురిమి నీటిలో కలపాలి.
►అందులో ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి రోజూ ఉదయం తాగాలి.
►ఫైబర్‌తో తాగడమే మంచిది. తురుము అడ్డు పడుతోందనిపిస్తే పది నిమిషాల తర్వాత వడపోసి తాగవచ్చు.
►ఈ జ్యూస్‌ డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. పై పరిమాణం ఒకరికి సరిపోతుంది.  

గమనిక: బీపీ, డయాబెటిస్‌లను అదుపులో ఉంచుకోవడానికి ఆమ్ల జ్యూస్‌ తాగాలనుకునే వారికి సూచన. ఉసిరికాయల సీజన్‌ పోయిన తర్వాత మార్కెట్‌లో రెడీమేడ్‌గా దొరికే ఎడిబుల్‌ ఆమ్లాపౌడర్‌ వాడవచ్చు. ఒక ఉసిరి కాయకు ఒక టీ స్పూన్‌ పౌడర్‌ దాదాపుగా సమానం. 

హనీ ఆమ్ల డ్రింక్‌ 
కావలసినవి:
►ఉసిరికాయ – ఒకటి
►గోరువెచ్చటి నీరు– కప్పు
►పుదీన ఆకులు– నాలుగు
►తేనె – టీ స్పూన్‌ 

తయారీ:
►ఉసిరికాయ, పుదీన ఆకులను మిక్సీలో గ్రైండ్‌ చేసి రసం తీసుకుని గోరువెచ్చటి నీరు, తేనె కలపాలి.
►ఈ జ్యూస్‌ని రోజూ ఉదయం తాగాలి.
►ఇది బీపీని క్రమబద్ధం చేస్తుంది.  

ట్రై చేయండి: Amla Candy: ఆరోగ్య లాభాలెన్నో.. ఇంట్లోనే ఇలా ఆమ్ల క్యాండీ తయారీ
బియ్యప్పిండి, పచ్చి బఠాణీలతో.. గ్రీన్‌ పీస్‌ అక్కీ రోటీ తయారీ
చదవండి: Diabetes: షుగర్‌ పేషెంట్లకు ఆరోగ్య ఫలం!.. ఒక్క గ్లాసు జ్యూస్‌ తాగితే 15 నిమిషాల్లో..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top