ఆదిలాబాద్ పట్టణంలో జరిగిన ఓ వివాహ వేడుకలో అరుదైన దృశ్యం ఆహూతులను మంత్రముగ్ధులను చేసింది. సాధారణంగా జరిగే పెళ్లి వేడుకలకంటే భిన్నంగా, ఈ పెళ్లిలో దేవతలే దివి నుంచి దిగివచ్చినట్లుగా అనిపించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ పెళ్లిలో, పెళ్లి కూతురి బంధువులు శివపార్వతులు, మహావిష్ణుమూర్తుల వేషధారణలో వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. ఈ వినూత్న ఆశీర్వాద కార్యక్రమం పెళ్లి వేడుకకు మరింత శోభను తీసుకొచి్చంది. పెళ్లికి వచి్చనవారు ఈ దృశ్యాలను తమ ఫోన్లలో బంధిస్తూ ఆనందాన్ని పంచుకున్నారు.


