ఆరోగ్యకరమైన, కాతివంతమైన చర్మం కావాలంటే సరైన కేర్ అవనరం. అందుకు సులభమైన మార్గం మనం ఇంట్లోనే సహజంగా ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోవడం. తద్వారా ఎలాంటి దుష్ప్రభావలు లేని మంచి కాంతివంతమైన, మెరిసే చర్మాన్ని ఈజీగా పొందొచ్చు. అదెలాగో నటి ప్రియాంక చోప్రా తల్లి, డాక్టర్ మధు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ సౌందర్య చిట్కా ఏంటో చూసేద్దామా..!
ప్రియాంక తల్లి డాక్టర్ మధు మాట్లాడుతూ.. "నేను ఎప్పుడు ఫేస్‌వాష్ కానీ సోప్ కానీ వాడలేదు. అప్పుడప్పుడు నేను స్ర్కబ్స్ ఉపయోగిస్తాను. ఇలా చేస్తే డెడ్ సెల్స్ పోయి, చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. నేను ఎప్పుడు హెల్దీ స్కిస్‌నే మెయింటెస్ చేస్తాను. ఏ చర్మ సమస్యలకైనా నా కూతురు నేన ఈ ఫేస్ ప్యాక్‌నే వాడతాం. ఈ ప్యాక్‌లో పసుపు, శెనగపిండి వంటి పదార్ధాల వలన చర్మానికి మంచి గ్లోయింగ్ రావడమే గాక తాజాగా కనిపిస్తుంది. " అంటూ ఆ ప్యాక్ చేసుకునే విధానం గురించి వివరించారామె.
ఎలా చేసుకోవాలంటే..
ఒక గిన్నెలోకిలోకి 2 టేబుల్‌స్పున్‌ల శెనగపిండి, డ్రై స్కిన్ ఉంటే ఇంట్లో చేసిన క్రీమ్, తాజా పెరుగు, కొద్దిగా తేనె కలిపి ముఖానికి అప్లై చేసి ఆరిపోయేంత వరకు ఉంచితే చాలు. ఆ తర్వాత ముఖం ఎంత కాంతివంతంగా ఉంటుందో ట్రై చేసి చూడండి మరి...
(చదవండి: 'పన్ను' వసూలు చేసే బ్యాడ్ హ్యాబిట్స్)


