ఎర్ర జామ వర్సెస్‌ తెల్ల జామ ఏది ఆరోగ్యానికి మంచిది? | Pink Guava vs White Guava Amazing Health Benefits | Sakshi
Sakshi News home page

ఎర్ర జామ వర్సెస్‌ తెల్ల జామ ఏది ఆరోగ్యానికి మంచిది?

May 26 2026 9:02 AM | Updated on May 26 2026 9:22 AM

Pink Guava vs White Guava Amazing Health Benefits

సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా లభించే ఫ్రూట్.. జామ (Guava). ఇందులో విటమిన్ సీ తోపాటు ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, సాధారణంగా మార్కెట్లలో మనకు తరచుగా రెండు రకాల జామకాయలు కనిపిస్తుంటాయి. ఒక రకానికి చెందినవి తెల్లగా ఉంటే, మరొకటి ఎర్రగా ఉంటుంది. ఈ తెల్ల జామ, ఎర్ర జామలు రెండూ పోషకాలతో నిండి ఉన్నప్పటికీ టేస్ట్, న్యూట్రిషన్ వాల్యూ, హెల్త్ బెనిఫిట్స్‌లో కాస్త విభిన్నంగా ఉంటాయి. మరి ఈ రెండింటిలో ఏది మంచిది, వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ మాటల్లో తెలుసుకుందామా.!.

ఎర్ర జామ, తెల్ల జామ రెండూ ఆరోగ్యానికి చాలా మంచివే. అయితే ఎర్ర జామలో నీటి శాతం ఎక్కువ, చక్కెర, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. తెల్ల జామలో విటమిన్-సీ, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. మధుమేహం (షుగర్) ఉన్నవారికి  బరువు తగ్గాలనుకునే వారికి ఎర్ర జామ కొంత మేలు చేస్తుంది. 

రెండింటిని పోల్చి చూస్తే..

తెల్ల జామకాయ
తెల్ల జామ ఎక్కువ తియ్యగా, రుచిగా ఉంటుంది. దీంట్లో షుగర్, స్టార్చ్, గింజల పరిమాణం అధికంగా ఉంటుంది. ఈ తెల్ల జామలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది. తెల్ల జామను తింటే ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. డైజేషన్ మెరుగై బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ని రెగ్యులేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మహిళలకు తెల్ల జామతో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. చర్మ కణాలకు హైడ్రేషన్‌ని పెంచి తాజాగా ఉండేలా చేస్తుంది. 

పీరియడ్స్ సమయంలో వచ్చే పెయిన్ నుంచి రిలీఫ్‌ని ఇస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్ కణాలతో పోరాడి ఈ వ్యాధి ముప్పుని తగ్గిస్తాయి. రోగనిరోధక శక్త పరంగా తెల్లజామకాయ బెస్ట్‌ అని చెబుతున్నారు ఆదర్శ గౌడ. 

డయాబెటిస్ పేషెంట్లకు ఎర్రజామ మేలు..
ఎర్ర జామకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. తెల్ల జామతో పోలిస్తే షుగర్, స్టార్చ్, విటమిన్ C కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఈ ఎర్రజామలో గింజలు అంత ఎక్కువగా ఉండవు. లైకోపీన్ వంటి పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, కెరోటినాయిడ్ల కారణంగా దీనిలోని గుజ్జుకి ఎరుపు రంగు వస్తుంది. 

ఇందులో లైకోపీన్ ఎక్కువగా ఉండటంతో గుండెకు రక్షణగా నిలుస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. విటమిన్ A, ఒమేగా-3, ఒమేగా- 6 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్‌తో నిండి ఉండటంతో డైజేషన్ మెరుగై వెయిట్ మేనేజ్‌మెంట్‌కు తోడ్పడుతుంది. ఇందులో చక్కెర కంటెంట్‌ తక్కువగా ఉండటం వల్ల షుగర్ పేషెంట్లకు మంచిది.

అయితే రక్తంలో చక్కెరను తగ్గించే మందులు తీసుకుంటుంటే జామకాయను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. ఏదైనా శస్త్రచికిత్స తర్వాత వెంటనే జామ పండ్లు తినకూడదు. ఎందుకంటే జామ తినడం వల్ల రక్తస్రావం ప్రమాదం పెరుగుతుంది. దీంతో గాయం మానడం ఆలస్యం అవుతుందని చెబుతున్నారు ఆదర్శ గౌడ .

(చదవండి: Health Benefits of Cucumber : పరగడుపునే కీరా తినొచ్చా..!?)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement