దక్షిణ భారతం
కొన్ని ప్రయాణాలు మనం ప్లాన్ చేస్తాం. కొన్ని ప్రయాణాలకు మాత్రం వర్షమే మనల్ని పిలుస్తుంది. చినుకులు పడిన వెంటనే పచ్చని పర్వతాలు, మేఘాలలో దాగిపోయిన లోయలు, జలజలా పారుతున్న జలపాతాలు కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తాయి.
దక్షిణ భారతంలో వర్షాకాలం అంటే కేవలం సీజన్ కాదు. అది ప్రకృతి తన అందాన్ని మరోసారి కొత్తగా అలంకరించే సమయం. కేరళ బ్యాక్ వాటర్స్ నుండి కర్ణాటకలోని ఘాట్స్ వరకు, తమిళనాడు హిల్ స్టేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని లోయల వరకు ప్రతీ చోట వర్షం ఒక కొత్త అనుభవాన్ని అందిస్తుంది.

దక్షిణాదిలోని కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వర్షాకాలంలో పచ్చని స్వర్గాన్ని తలపిస్తాయి. వెస్ట్రన్ ఘాట్స్ మొత్తం మేఘాలతో కవర్ అవుతుంది. ఈ సమయంలో ఈ ప్రాంతం మొత్తం ఒక పెయింటింగ్‌లాగ కనిపిస్తుంది. రోడ్డు పక్కనే వెలిసిన కాఫీ తోటలు, టీ ఎస్టేట్స్, శాండిల్‌వుడ్ సువాసనలు, వర్షంతో తడిసిన అడవులుం ప్రతీ దశ్యం ఒక సినిమా ఫ్రేమ్‌లా ఉంటుంది. ఉదయం సమయంలో మేఘాలు కొండల్ని ముద్దాడుతుంటే, మధ్యాహ్నం చినుకుల మధ్య సూరీడు అందంగా ప్రకాశిస్తాడు. సాయంత్రం అయితే కురిసే వర్షం ఆ తరువాత వీచే చల్లని గాలి మనసుని కూడా ఫ్రెష్‌గా మార్చేస్తుంది.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి మాన్ సూన్ జర్నీ మొదలైతే ట్రెయిన్ విండో పక్కన కూర్చొని వెళ్లడంలోనే ఒక ప్రత్యేక ఆనందం ఉంటుంది. సిటీ బిల్డింగ్స్ మెల్లిగా కనుమరుగై, పంటపొలాలు, నదులు, అడవులు మొదలవుతాయి. రోడ్ జర్నీలో ఘాట్ రోడ్డులు, మేఘాల మధ్య ట్రావెల్ చేస్తూ ప్రతీ టర్న్‌లో కొత్త సీన్ ను ఎంజాయ్ చేయవచ్చు.
ఫ్లైట్ జర్నీ అయినా కూడా మేఘాల పైన వెళ్తున్న అనుభవం వేరే ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ నుండి హిల్ స్టేషన్స్ వైపు వెళ్తుంటే వెదర్ మెల్లిగా మారడం గమనించవచ్చు.
విజయవాడ నుంచి ప్రయాణం మొదలు పెట్టే వారికి కూడా రైల్ అండ్ రోడ్డు మార్గంలో ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.
ప్రతీ కిలో మీటర్‌లో వాతావరణం మారిపోతుంది. గాలి చల్లబడుతుంది. పచ్చని దశ్యాలు చూసి మనసు పరవశించి పోతుంది. ఈ చిన్న చిన్న విషయాలు ప్రయాణాల్ని మెమోరెబుల్ చేస్తాయి.

యాత్రా, బడ్జెట్ వివరాలు..
హైదరాబాద్ లేదా విజయవాడ నుండి 5 రోజుల మాన్ సూన్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే, ఎంచుకునే ప్రయాణ శైలిని బట్టి బడ్జెట్ మారుతుంది. ఒక సాధారణ బడ్జెట్ రేంజ్ ట్రిప్ కోసం వ్యక్తికి సుమారు రూ. 18,000 నుండి రూ. 25,000 వరకు ఖర్చు అవుతుంది.
అదే కొంచెం సౌకర్యవంతంగా ఉండే స్టాండర్డ్ కంఫర్ట్ ట్రిప్ అయితే రూ. 30,000 నుండి రూ. 45,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ప్రీమియం రిసార్టులు, ప్రైవేట్ వాహనాలతో లగ్జరీగా ప్లాన్ చేసుకుంటే మాత్రం మనిషికి రూ. 60,000 నుండి రూ. 90,000 వరకు బడ్జెట్ అవసరమవుతుంది.
ఇక బస విషయానికి వస్తే, బడ్జెట్ హోటల్స్‌లో ఒక రాత్రికి రూ. 1,500 నుండి రూ. 3,000 మధ్య ఛార్జీలు ఉంటాయి. మధ్యస్థంగా ఉండే స్టాండర్డ్ రిసార్టులు అయితే రూ. 4,000 నుండి రూ. 8,000 వరకు, విలాసవంతమైన ప్రీమియం స్టేలు రాత్రికి రూ. 10,000 పైనే ఉంటాయి.
ఇక ఆహార ఖర్చుల కోసం మీ లైఫ్‌స్టైల్‌ను బట్టి రోజుకు సుమారు రూ. 600 నుండి రూ. 1,500 మధ్య ప్లాన్ చేసుకోవచ్చు.
n విజయవాడ నుంచి ట్రావెల్ చేసే వాళ్లకి ట్రాన్స్‌పోర్ట్ కాస్ట్ కొంచెం మారవచ్చు కానీ ఓవరాల్ బడ్జెట్ దగ్గరగానే ఉంటుంది. కొన్నిప్రాంతాల్లో ప్లాంటేషన్ స్టేలు, హెరిటేజ్ కాటేజీలు, హౌజ్ బోర్డు ఎక్స్‌పీరియన్సులు, లోకల్ సైట్ సీయింగ్ ΄్యాకేజీలు కూడా లభిస్తాయి. ఈ అనుభవాలు వర్షాకాలం జర్నీని మరింత మెమోరెబుల్‌గా మార్చేస్తాయి.

ఏం చూడాలి?
వర్షాకాలంలో జలపాతాలు ఫుల్ ఫ్లోలో ఉంటాయి. లోయలు మొత్తం తెల్లని పొగ మంచు కప్పేసుకుంటాయి. టీ తోటల్లో వర్కర్స్ మెల్లిగా పని చేసుకుంటూ కనిపించే దశ్యం స్థానికుల జీవితాన్ని దగ్గరగా చూపిస్తుంది.
అడవి మార్గాల్లో ట్రావెల్ చేస్తుంటే చిన్న చిన్న జలపాతాలు రోడ్డు పక్కనే పరిగెడుతూ ఉంటాయి. సరస్సులపై పడుతున్న చినుకులు, అవి సష్టించే చిన్న చిన్న వలయాల సోయగం కళ్లతో చూడాల్సిందే.
ఉదయం సూర్యోదయం కోసం వేచి చూస్తున్న మేఘాలు చాలా అందంగా ఉంటాయి. సాయంత్రం సమయంలో మేఘాలు మెల్లిగా క్లియర్ అయ్యాక కనపించే పచ్చదనం పైసా వసూల్ సీన్ లా అనిపిస్తుంది.
ఈ ప్రయాణంలో జలపాతాల దగ్గర కొన్ని నిమిషాలు గడపడం, ప్లాంటేషన్ వాక్స్ ఎంజాయ్ చేయడం, లోకల్ మార్కెట్‌లో తిరగడం, బోటింగ్‌ను ఆస్వాదించడం, సన్ రైజ్ వ్యూ పాయింట్ వద్ద సైలెంట్‌గా నిలబడటం అనే ఈ ఐదు అనుభవాలు సహజంగానే ఈ సీజన్ ని మరింత మధురంగా మార్చేస్తాయి.
ఎక్కడ ఉండాలి?
వర్షాకాలంలో స్టే అంటే కేవలం రూమ్ మాత్రమే కాదు. మార్నింగ్ బాల్కనీలో కాఫీ కప్ పెట్టుకుని మేఘాలను చూస్తూ గడిపే నిమిషాలు గుర్తుండిపోయే జ్ఞాపకాలు అవుతాయి.
వుడెన్ కాటేజీలు, ప్లాంటేషన్ రిసార్టులు, లోయవైపు ఉన్న హోమ్ స్టేలు, లేక్ సైడ్ ప్రాపర్టీలుం ఇవన్నీ ప్రకతి మధ్య కలిసిపోయిన
అనుభవాన్ని ఇస్తాయి.రాత్రి సమయంలో వర్షం చినుకుల శబ్దం అనేది వినసొంపైన శబ్దంగా అనిపిస్తుంది.
ప్రతీ ఉదయం విండో తెరిస్తే చల్లని తాజా గాలి, తడిసిన మొక్కల సువాసనలు, దూరంలో కనిపించే ఫాగ్ ఇవన్ని కలిసి ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి.
మున్నార్..
వర్షాకాలంలో మున్నార్ టీ గార్డెన్స్ మధ్య నడుస్తుంటే ప్రతీ క్షణం మేజికల్‌గా అనిపిస్తుంది. ఆకాశంలో మేఘాలు కొండల మధ్య తిరగడాన్ని చూస్తుంటే సమయం కూడా నెమ్మదిగా నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది.
కూర్గ్..
కూర్గ్ కాఫీ ఎస్టేట్స్‌లో వర్షం పడిన తరువాత వచ్చే కాఫీ వాసన చాలా రోజులు గుర్తుండిపోతుంది. చిన్న జలపాతం, గ్రీన్ వ్యాలీస్, తొలి మంచుతో కలిసిన రోడ్డు మార్గాల్లో వెళ్తుంటే సైలెంట్ మెలోడీలో మనం భాగం అయినట్టు అనిపిస్తుంది.

వయనాడ్..
వయనాడ్ అడవుల మధ్య ట్రావెల్ చేస్తుంటే ప్రకృతి మాత్రమే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. బాంబూ ఫారెస్ట్, జలపాతాలు, లేక్స్ అన్నీ మాన్ సూన్ లో మరింత లైవ్‌లీగా మారుతాయి.
చిక్‌మగళూరు..
చిక్‌మగళూరు కొండల్లో సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తే మేఘాల మధ్య నుండి వెలుగు బయటికి వస్తున్న దశ్యాన్ని వర్ణించేందుకు మాటలు సరిపోవు.
అరకు వ్యాలీ..
ఆంధ్రప్రదేశ్‌లో అరకు వ్యాలీ కూడా ఈ సీజన్ లో మరింత అందంగా మారిపోతుంది. కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూపాయింట్, బొర్రా పరిసరాలు అన్ని చినుకులతో కలిసి ఒక ఫ్రెష్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది.

ఏం తినాలి?
కేరళలో అప్పం అండ్ వెజిటెబుల్ స్టూని వర్షం పడుతున్నప్పుడు తినడం అనేది ఎప్పుడూ మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది. అలాగే తాజా మసాలాలతో తయారు చేసిన కూరలు లోకల్ ఫ్లేవర్‌ను పరిచయం చేస్తాయి.
కూర్గ్‌లో ఫిల్టర్ కాఫీ ప్రతీ సిప్పులో కాఫీ ఎస్టేట్ అరోమా ఉంటుంది. చిక్‌మగళూరు కాఫీ కూడా ట్రావెల్ మెమోరీస్‌లో స్పెషల్ ప్లేస్‌ను పొందుతుంది.
తమిళనాడు హిల్ స్టేషన్ లో హాట్ హాట్ ఇడ్లీలు, దోశ, పొంగల్ చల్లని వాతావరణంలో ఒకరకమైన కంఫర్ట్‌ను ఇస్తాయి.
అరకులో బాంబూ చికెన్, ట్రైబల్ వంటకాలు, ఫ్రెష్ కాఫీ కాంబినేషన్ అనేవి లోకల్ కల్చర్‌ని రుచుల ద్వారా తెలుసుకునే అవకాశంగానే భావించవచ్చు.
ఆసక్తికరమైన విషయాలు..
మాన్ సూన్ బెస్ట్ టైమ్: జూన్ నుండి సెప్టెంబర్ వరకు సౌత్ ఇండియాలో ప్రకతి దర్శనం అత్యంత అందమైన అనుభూతిగా మిగులుతుంది. ఫేమస్‌ప్రాంతాలు: పశ్చిమ కనుములు అనేవి యునెస్కో జీవ వైవిధ్యప్రాంతంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. స్లో ట్రావెల్, నేచర్ వాక్, ఫోటోగ్రఫీతో పాటు ప్రశాంతమైన హాలిడేస్ కోసం వర్షాకాలం చాలా అనువైన కాలం అని చెప్పవచ్చు. అయితే ట్రిప్ స్టార్ట్ చేసే ముందు మీరు వెళ్లే దారి, డెస్టినేషన్ లో పరిస్థితి గురించి తెలుసుకోవడం మరవద్దు.
గమనిక:
ట్రావెల్, బడ్జెట్ వివరాలు అనేవి మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు తాజా అప్డేట్స్ స్వయంగా వెరిఫై చేసుకోగలరు. – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు


