వయసు చిన్నదే..కానీ మనసు మాత్రం చల్లన | Meet These Children Who Offering Cool Juice For People In Hot Summer, Win Hearts And Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

వయసు చిన్నదే..కానీ మనసు మాత్రం చల్లన

May 30 2026 10:57 AM | Updated on May 30 2026 12:04 PM

meet theese Children  who offering cool Juice For People In Hot Summer

సమ్మర్ కిడ్స్ జ్యూస్ స్టోరీ

వేసవి సెలవలు అంటే....పిల్లలకు మహా సరదా. ఆటలు, పాటలు, సినిమాలు, షికార్లు...ఇంకేముందు ఫుల్ ఎంజాయ్. దాదాపుగా పిల్లలంతా ఇలానే ఉంటారు కదా. కాని మణికొండ పుప్పాలగూడ ప్రాంతంలోని పిల్లలు ఈ వేసవిలో చేసిన పనిని చూస్తే పెద్దవాళ్లందరూ ముక్కున వేలేసుకుంటారు. అంతేకాదు ఇది చూసి తమ పిల్లలు కూడా ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు. అసలింతకీ ఆ పిల్లలు ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదివేయండి మరి.

సమ్మర్ అంటే సూపర్ హాట్ కదూ...ఎండ వేడి, ఉక్కపోత విపరీతమైన దాహం. మరీ ముఖ్యంగా ఏదైనా పని మీద రోడ్డు మీదకు వెళినపుడు దాహమేస్తే ఇక నరకమే. కాని మణికొండ పుప్పాలగూడ ప్రాంతాంలోని బాలాజీనగర్ రోడ్డు నెం.4 కి వెళితే మాత్రం మీకు ఓ జ్యూస్ స్టాల్ కనిపిస్తుంది. అందులో నుండి బుడి బుడి అడుగులతో పిల్లలు బయటకు వచ్చి మీకు చల్లని జ్యూస్ అందిస్తారు. అది కూడా మీకు ఏ జ్యూస్ కావాలో అడిగి మరీ ఇస్తారు. అంతేకాదు మీ దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోరు. అలా దారిన పోయే ప్రతి ఒక్కరికి వారం నుండి దాహం తీరుస్తున్నారు ఈ పిల్లలు. 

పుప్పాలగూడ లోని త్రిపుర రెసిడెన్సీ, టెంపుల్ వ్యూ రెసిడెన్సీ వాసుల పిల్లలు సంయుక్తంగా చేప్పట్టిన ఈ సోషల్  ఇనిషియేటివ్ పలువురిని ఆకర్షిస్తోంది. ఏది ఏమైనా ఈ పిల్లల ఆలోచన మాత్రం  నిజంగా సూపర్ కదూ, ఇంకెందుకాలస్యం పేరెంట్స్ మీ పిల్లలతో మీ ప్రాంతంలో ఓ సారి ట్రై చేయండి.

ఇదీ చదవండి: Yoga ఉత్కటాసనంతో లాభాలేంటో తెలుసా?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement