అనుగ్రహబలమివ్వు సీతారామా! | May the divine grace of Lord Sri Rama fill your life with peace | Sakshi
Sakshi News home page

అనుగ్రహబలమివ్వు సీతారామా!

Mar 27 2026 2:17 AM | Updated on Mar 27 2026 2:17 AM

May the divine grace of Lord Sri Rama fill your life with peace

‘శ్రీరాముని అనుగ్రహబలమే బలము’ అన్నాడు త్యాగయ్య. రాముని అనుగ్రహం అతి సులువు. మాటకు కట్టుబడుట... మంచికి కట్టుబడుట... ఇవి చేస్తే చాలు.  అయిననూ ఆయన మనయందు పరాకుగా ఉంటే ఒక మాట చెప్పేందుకు సీతమ్మ తల్లి ఉండనే ఉందిగా. సీతాసమేతుడైన ఆ దివ్యమూర్తి జన్మదినమూ, వివాహమూ లోక విశేషము. పొందగలిగినన్ని వరములు ప్రతి ఒక్కరూ పొందాలని ఆకాంక్షిస్తూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.


స్థితప్రజ్ఞత
రేపే పట్టాభిషేకం అన్నప్పుడు పొంగిపోలేదు, ఆ పట్టాభిషేకం ఆగిపోయి, అడవికి వెళ్లాలని తెలిసినప్పుడు కుంగిపోలేదు. తండ్రిని నిందించలేదు, పినతల్లి కైకేయిని ద్వేషించలేదు. ఆ క్షణంలో ఆయన చూపిన నిలకడ స్థితప్రజ్ఞకి పరాకాష్ట. అత్యంత ఒత్తిడిలో కూడా విచక్షణ కోల్పోకుండా ఉండటం ఒక గొప్ప వ్యక్తిత్వ లక్షణం.


కృతజ్ఞత  
ఎవరైనా వంద తప్పులు చేసినా వాటిని పట్టించుకోకుండా, వారు చేసిన ఒక్క చిన్న మేలును కూడా ఎప్పటికీ గుర్తుంచుకునే గొప్ప గుణం రాముడిది. కృతజ్ఞత చూపడంలో రాముడు ఒక మార్గదర్శి.


ధర్మబద్ధత
రాముడిని ‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ అంటే ధర్మానికి ప్రతిరూపంగా పేర్కొంటారు. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు. రాముడి బాణం దెబ్బ తొలుతగా రుచి చూసిన మారీచుడే. అంటే శత్రువు చేత కూడా ప్రశంసలు పొందేంతటి ధర్మగుణం కలవాడన్నమాట. ఎన్ని కష్టాలు ఎదురైనా తను నమ్మిన సత్యం, ధర్మం నుంచి తప్పుకోకపోవడం ఆయన గొప్పతనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement