
ప్రపంచ నిద్ర దినోత్సవం ప్రతీ ఏడాది మార్చి 14న జరుకుంటారు. ప్రపంచం ఆరోగ్యానికి అత్యంత నిర్లక్ష్యం చేయబడిన అంశంఏదైనా ఉందీ అంటే నిద్ర. అందుకే నిద్ర ఆవశ్యతక పై అవగాహనను పెంచుతూ ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా అవసరమని ప్రపంచ నిద్ర దినోత్సవం గుర్తుచేస్తుంది. పనికి, వినోదానికి ఇస్తున్న ప్రాధాన్యత నిద్రకు ఇవ్వకపోవడం అనేక రుగ్మతలకు దారితీస్తోంది.
నిద్ర ముఖ్యమని మనలో చాలా మందికి తెలుసు, దురదృష్టవశాత్తు నిద్ర అవసరాన్ని మాత్రం గుర్తించడం లేదు. సరిగా నిద్ర పోకపోవడం వల్ల గుండె, నరాల సంబంధిత సమస్యలు, జ్ఞాపకశక్తిని కోల్పోవడం, బరువు పెరగడం వంటి సమస్యలొస్తాయనేవిషయాన్ని గుర్తించడం లేదు గుర్తించినా, నిర్లక్ష్యం, జీవనశైలి, ఒత్తిడి, అనారోగ్యం తదితర కారణాలరీత్యా నిద్రకు దూరమవుతున్నారు.
నిద్ర ప్రాముఖ్యత
నిద్రలో మన నిష్క్రియాత్మకంగా ఉంటాం...కానీ మన శరీరానికి కావాల్సిన మరమత్తులన్నీ నిద్రలోనే జరుగుతాయి. ముఖ్యంగా రాత్రిపూట మనం పోయే నిద్ర మానసిక ఉల్లాసాన్నిస్తుంది. మెదడులాంటి కీలక అవయవాలకు విశ్రాంతి నిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుండి కాపాడుతుంది.
కణజాలాల మరమ్మతు , కండరాల అభివృద్ధి జ్ఞాపకశక్తి పెరగడం ఇవన్నీ నిద్రలోనే జరుగుతాయి. మూడ్ మేనేజ్‌మెంట్‌కి నిద్ర చాలా అవసరం. ఆందోళన , నిరాశ దూరమవుతాయి. అంతెందుకు నిద్రలేమి ఒబెసీటీకి, మధుమేహం,ఇతర జీవక్రియ వ్యాధులకు దారి తీస్తుంది.
ఎవరికెంత నిద్ర అవసరం?
ప్రతి వయస్సు వారికి నిద్ర అవసరం ఉంటుంది. అయితే సాధారణ వ్యక్తి రాత్రిపూట 7 నుండి 9 గంటలు అవసరం.
శిశువులు (4-12 నెలలు): 12-16 గంటలు
పసిపిల్లలు (1-2 సంవత్సరాలు): 11-14 గంటలు
ప్రీ-స్కూలర్ (3-5 సంవత్సరాలు): 10-13 గంటలు
చదువుకునే పిల్లలు (6-12 సంవత్సరాలు): 9-12 గంటలు
టీనేజర్లు (13-18 సంవత్సరాలు): 8-10 గంటలు
పెద్దలు (18+ సంవత్సరాలు): 7-9 గంటలు
నిద్ర ఎందుకు రాదు
స్క్రీన్ ఎక్స్‌పోజర్: రాత్రిపూట స్క్రీన్ సమయం ఎక్కువైతే నిద్ర పారిపోతుంది. నీలి కాంతికి గురికావడం వల్ల మెలటోనిన్ (నిద్ర హార్మోన్) కు అంతరాయం కలిగిస్తుంది.పడుకునే ముందు , ఇమెయిల్స్, సోషల్‌మీడియా స్క్రోలింగ్ దూరంగా ఉండాలి.
పనిలో ఒత్తిడి ఒక ప్రధానమైన సవాల్.
పని ఒత్తిడితో సమయానికి నిద్రపోకపోవడం.
కెఫిన్ , ఆల్కహాల్: ఆల్కహాల్ మత్తునిస్తుంది, కానీ అది స్లీప్ సైకిల్‌ను పాడు చేస్తుంది.
నిద్రలేమి, స్లీప్ అప్నియా, రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్
నిద్ర నాణ్యతను ఎలా మెరుగుపడుతుంది
చక్కటి శారీరక నిద్రను రారమ్మని పిలుస్తుంది. అలాగే మన స్లీప్ సైకిల్‌ను ఒకేలాగా మెయింటైన్ చేయాలి. ప్రతి రోజూ (వారాంతాల్లో కూడా) ఒకే సమయంలో పడుకోవడం, మేల్కొవడం వల్ల సహజ సిర్కాడియన్ సిస్టం బాగుపడుతుంది.
నిద్రకు ముందు పుస్తకం చదవడం, ధ్యానం చేయడం లేదా వెచ్చని నీటితో స్నానం చేయడం వంటివి చేస్తే ఉత్తమం.
బెడ్‌రూమ్‌ను చల్లగా, చీకటిగా, నిశ్శబ్దంగా ఉండటం, నాణ్యమైన పరుపు, బ్లాక్‌అవుట్ కర్టెన్లను కూడా ఉపకరిస్తాయి.
పగటిపూట నిద్రకు బై బై చెప్పేసి.. వాకింగ్ యోగా, ధ్యానం, జిమ్ లాంటికోసం రోజులోకనీసం అరగంట కేటాయిస్తే చక్కటి నిద్ర మీ సొంమవుతుంది. ‘కంటి నిండా కునుకు పడితే మనసు కుదుట పడుతుంద’ని ఊరికే అన్నారా మరి!
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిద్ర మిమ్మల్నిపలకరించకపోతే..మీరు వైద్యుడిని సంప్రదించాల్సిన సమయం వచ్చిందని అర్థం. దీన్ని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment