ప్రపంచంలో ఎన్ని రకాల కోకిలలు ఉన్నాయో తెలుసా? | less known facts abouts All Cuckoo Bird koel Species in the World | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో ఎన్ని రకాల కోకిలలు ఉన్నాయో తెలుసా?

May 26 2026 2:55 PM | Updated on May 26 2026 3:16 PM

less known facts abouts All Cuckoo Bird koel Species in the World

వసంతకాలం వచ్చిందంటే లేతచివుళ్లు ఆరగించి  "కుహూ.. కుహూ.. రాగాలతో మనల్ని ఆదరించే పక్షి కోకిల. దాని గాత్రం అంత మధురం కాబట్టే, గాన కోకిల అంటారు. ముఖ్యంగా వసంత కాలంలో మగ కోకిలలు పాడే రాగాలు ప్రకృతికి ప్రాణం పోస్తాయి. కోకిలలు తమ సొంత గూళ్ళను నిర్మించుకోవు. ఆడ కోకిలలు కాకులు లేదా ఇతర చిన్న పక్షుల గూళ్ళను కనిపెట్టి, వాటి గూటిలో తమ గుడ్లను పెడతాయి. వీటికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు చూద్దామా.

ప్రపంచంలో మొత్తం 54 రకాల కోకిలలు ఉన్నాయి.  వీటి ప్రధాన ఆహారం...గొంగళి పురుగులు. ఆకులు, పండ్లు కూడా తింటాయి కానీ, గొంగళి పురుగులను చాలా ఇష్టంగా తింటాయి! 

కాకికీ కోకిలకీ తేడా కనిపెట్టాలంటే వాటి ఈకలు చూడాలి. మగ కోకిల మెడ నుంచి తల వరకూ నలుపు కాకుండా నీలం, బూడిదరంగు కలిసినట్టుగా ఉంటుంది. కొన్ని ఆడవి కూడా ఇలానే ఉంటాయి కానీ... వాటికి ఛాతీమీద ఈకల రంగు ముదురుగా ఉంటుంది. పిల్లలుగా ఉన్నప్పుడు కొన్ని ఎరుపు, బ్రౌన్‌ కలర్స్‌లో కూడా ఉంటాయి. కాకపోతే... అత్యంత దగ్గర్నుంచి చూస్తే తప్ప ఈ తేడాలను మనం గమనించలేం! 

వీటి రెక్కలు పొడవుగా, సూదిగా ఉంటాయి. ముక్కు కూడా సూదిగా ఉంటుంది. ఎగిరినప్పుడు కాస్త గద్దల మాదిరిగా కనిపిస్తాయివి! 

వేసవికాలం కోకిలలకు సంతానోత్పత్తి కాలం. మగ కోకిల ప్రధానంగా ఆడ కోకిలను ఆకర్షించడానికి పాడుతుంది. దాని పాట ఆడ కోకిలలకు సంభోగ సంకేతంగా పనిచేస్తుంది. 

ఇవి గూళ్లు కట్టుకోవు. పిల్లల్ని పొదగవు. వేరే పక్షుల గూళ్లలో గుడ్లు పెడతాయి. పట్టుకు పది నుంచి 22 గుడ్లు పెడతాయి. అయితే అన్నీ ఒక గూటిలో పెట్టవు. వేర్వేరు చోట్ల పెడతాయి. ఆయా పక్షులన్నీ తమ గుడ్లతో పాటు తన గుడ్లను  పొదుదుగుతున్నాయో లేదో గమనిస్తూ ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement