breaking news
Cuckoo
-
కోయిల! వేప!మల్లి! మామిడి! ఎవరు గొప్ప?
కొత్తరాగమున కుహూకుహూమని మత్తిలి కోయిల కూయగా... కొమ్మలో కోయిలా కూయంటదే...తొందరపడి ఒక కోయిల ముందే కూసింది...గున్నమామిడి కొమ్మమీద గూళ్లురెండున్నాయి... ఒక గూటిలోన రామచిలకుంది... ఒక గూటిలోని కోయిలుంది... కోయిల పాట బాగుందా... కొమ్మల సిరి బాగుందా... ఏవమ్మోయ్ కోయిలమ్మా! నీ మీద వచ్చిన పాటలు వింటూ కూర్చున్నావు. యేమంత మిడిసిపాటుతో నెల రోజుల ముందు నుంచే పాడటం ప్రారంభించావు. అంత గొప్పలు ఎందుకు నీకు? నువ్వు పాడటానికి ఓ సమయం సందర్భం లేదా...అంటూ మావి చిగురు కోకిలను ఎకసెక్కాలాడటం ప్రారంభించింది.బాగానే ఉంది నువ్వు చెప్పేది. నీ చిగుళ్లు ముందుగా రాబట్టే కదా నేను ముందుగా వాటిని తిని, గొంతు సవరించి, కుహూకుహూ అని కూయటం ప్రారంభించాను... అని గడుసుగా సమాధానం చెప్పింది కోకిల.నా చిగుళ్లు తింటేనేగా నీకు గొంతు అంత తియ్యగా స్వరం పలికేది. నేను చిగురించకపోతే నీ పాటకు తావెక్కడ. నా గొంతు తియ్యగా ఉందా. నీ చిగుళ్లు తియ్యగా ఉంటాయని ఎవరో చెప్పడంతో తిన్నాను. ఆ వగరుకి నాకు గొంతులో దురద వచ్చి, ఆ దురద పోగొట్టుకోవడానికి ఇలా అరుస్తున్నాను. అదే మీరంతా తీయని పాట అంటున్నారు. అంతేఅయితే ఆ ఘనత అంతా నాదే. నా వగరు చిగుళ్ల వల్లే నీకు తీయని కంఠస్వరం వచ్చింది. నీకు దురద పెడితే మాకెందుకు, దురద పెట్టకపోతే మాకెందుకు. ఇంతకీ మా సంగతి పక్కన పెట్టు, నువ్వు అంత ముందుగానే ఎందుకు పూత పూశావు. నీ అవసరం ఉన్న రోజు వచ్చేసరికి పూత కాస్తా పిందెలు అయిపోతావు. మమ్మల్ని అనే ముందు నిన్ను నువ్వు ఓ సారి చూసుకుని మమ్మల్ని వేపుకు తినకమ్మా వేప తల్లీ!నా సంగతి సరే. ఆ గున్నమామిడి సంగతి చూడండి... మిమ్మల్ని అనే హక్కు నాకు లేదు. అందుకే మౌనంగా ఉంటున్నాను. పిందెగా ఉండవలసిన నేను అప్పుడే కాయలు, పండ్ల రూపంలోకి మారిపోతున్నాను. ఇలా ఎందుకు జరుగుతోందంటావు చెరుకు తల్లీ!కాలమహిమ! ఋతువులకు అనుగుణంగా పంటలు పండే రోజులు మారిపోయాయి. పోనీలే... ముందు నుంచే మనల్ని రుచి చూస్తారు కదా. వాళ్లకి ఆనందం కలిగిస్తున్నాం కదా. కానీ ఈసారి నేను ఎందుకో అంత తియ్యగా ఉండేలా కనిపించట్లేదు. మన మల్లి తల్లి మాత్రం అప్పుడే పరిమళాలను ఘుమాయించేస్తోంది. గుభాళించి ఏం లాభం. ఒకప్పుడు నా పూలతో జడలు కుట్టించుకుని, అద్దం ముందు నిలబడి, ఫొటోలు తీయించుకోవడం చిన్నపిల్లలందరికీ ఒక సరదా. మరి ఇప్పుడో! అందరూ జుట్లు విరబోసుకునేవాళ్లు, పూలు పెట్టుకోవడానికి మొహమాట పడేవాళ్లూనూ. నాకు మాత్రం తాచుపాము జడలలో చుట్టలా చుట్టుకుని నల్లటి కురులలో తెల్లగా మెరవడం చాలా ఇష్టం. కనీసం కొందరైనా నన్ను అక్కున చేర్చుకుంటున్నారులే. అంతటితో తృప్తి చెందుతున్నాను.సరే మనలో మనం మాట్లాడుకుంటూ అసలు విషయం మర్చిపోయాను. ఈ రోజు మనందరం కలిసి ఒక విషయం గురించి చర్చించుకోవాలి. మన తెలుగువారి కొత్త సంవత్సరాదికి ఉగాది అని ఎందుకు పేరు పెట్టాలి. మనతోటే కదా ఉగాది వచ్చేది. కోయిల కూస్తేనే కదా వసంతం వచ్చేది. మామిడి, చెరకు, వేపపూత, బెల్లం, చింతపండు, ఉప్పు, కారం కలిస్తేనే కదా పచ్చడి. మరి మనలో ఎవరో ఒకరి పేరు మీద ఈ పండుగను పిలుచుకోవచ్చుగా. ఆమని అంటారేకాని, కోమని అనచ్చుగా. కనీసం అందులో మన కోయిల పేరులోని మొదటి అక్షరమైనా ఉంటుంది. లేకపోతే ఆమిడి అనొచ్చు, వేపని అనొచ్చు, మల్లిమ అనొచ్చు. ఏదో ఒక పేరు పెట్టి మనల్ని గౌరవించుకోవచ్చు కదా. ఏదీ కాకుండా ఉగాది అని పేరు పెట్టారు. సొమ్మొకడిది సోకొకడిది అంటే ఇదేనేమో. అందరి కంటె పెద్దదయిన మామిడి...మిత్రులారా! మీకొక విషయం చెబుతాను వినండి. ఈ పండుగకు కోయిల పేరు పెట్టామనుకోండి. మిగతా వారికి కోపం వస్తుంది. మనమందరం ప్రకృతి మాత సంతానం. మనలో ఏ ఒక్కరు అలిగినా ఆ తల్లికి బాధే కదా మరి. అందుకే ఆలోచించి, మనమెవ్వరం బాధపడకుండా ఈ పేరు పెట్టి ఉంటారు. అయినా ఉగాది అనే పేరు ఎంత బాగుందో కదా! ఇంకో విషయం కూడా ఆలోచించు. ఈ పండుగ ఆరు రుచులతో పాటు కోయిల, మల్లెల సమ్మేళనం. ఏ ఒక్కరికో సంబంధించినది కాదు కదా. అందుకే ఉగాది అయ్యింది. – డా. వైజయంతి పురాణపండ -
కోకిల మోసాలకు పక్షుల చెక్!!
కోకిల.. ఎంత సుమధురంగా పాడుతుందో అంత బద్ధకంగా ఉంటుంది. తాను పెట్టిన గుడ్లను పొదగాలంటే కూడా దానికి మహా బద్ధకం. అందుకే.. కాకుల్లాంటి ఇతర పక్షుల గూళ్లలో వాటికి తెలియకుండా వెళ్లి గుడ్లు పెట్టేసి వస్తుంది. ఆ విషయం తెలియని కాకి.. తన గుడ్లతో పాటు వాటిని కూడా పొదుగుతుంది. పిల్లలు బయటకు వచ్చే వరకు దానికి అసలు సంగతి తెలియదు. ఈ విసయం కొన్ని తరాలుగా అందరికీ తెలిసినదే. కానీ.. ఇన్ని తరాల తర్వాత ఇప్పుడు కాకులతో పాటు ఇతర పక్షులు కూడా తెలివి నేర్చుకున్నాయి. తమ గుడ్లేవో, కోకిల గుడ్లేవో తెలుసుకోడానికి ప్రత్యేక ఏర్పాట్లను అవి చేసుకుంటున్నాయి. ఫొటోలను ఎవరూ కాపీ కొట్టకుండా దాని మీద వాటర్ మార్క్ వేయడం అందరికీ తెలుసు కదూ. అచ్చం అలాగే ఇప్పుడు ఇతర జాతుల పక్షులన్నీ కూడా ఇలాంటి సరికొత్త టెక్నిక్లు నేర్చుకున్నాయట. ఈ విషయం తమ పరిశోధనలో తేలిందని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన మేరీ కాస్వెల్ స్టాడార్డ్ తెలిపారు. కోకిలలు కేవలం కాకులనే కాదు.. ప్రధానంగా ఎనిమిది రకాల పక్షులను ఎంచుకుని, వాటి గూళ్లలో తమ గుడ్లు పెడుతుంటాయి. ఈ ఎనిమిది రకాల పక్షుల గుడ్లను శాస్త్రవేత్తలు కంప్యూటర్ ఆధారిత పరికరాలతో నిశితంగా పరిశీలించారు. అప్పుడు.. వాటిమీద ఉన్న పిగ్మెంటేషన్లలో మార్పులు గమనించారు. వీటిని ఆయా పక్షులు సాధారణ కంటితోనే గుర్తించగలవు. కొన్ని పక్షులు ఒకేరకం మచ్చలున్న గుడ్లను పెడుతుంటే, మరికొన్ని జాతులు మాత్రం పక్షికి పక్షికి కూడా ఈ పిగ్మెంటేషన్లను మార్చేస్తున్నాయి. -
కోకిలమ్మకు స్వార్థం ఎక్కువే!
ప్రపంచంలో మొత్తం 54 రకాల కోకిలలు ఉన్నాయి. ఐరోపాలో రెండు రకాలు మాత్రమే ఉంటాయి. మిగతావన్నీ ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల్లో జీవిస్తున్నాయి! వీటి ప్రధాన ఆహారం... గొంగళి పురుగులు. ఆకులు, పండ్లు కూడా తింటాయి కానీ, గొంగళిపురుగులను చాలా ఇష్టంగా తింటాయి!కాకికీ కోకిలకీ తేడా కనిపెట్టాలంటే వాటి ఈకలు చూడాలి. మగకోకిల మెడ నుంచి తల వరకు నలుపు కాకుండా నీలం, బూడిదరంగు కలిసినట్టుగా ఉంటుంది. కొన్ని ఆడవి కూడా ఇలానే ఉంటాయి కానీ... వాటికి ఛాతీ మీద ఈకల రంగు ముదురుగా ఉంటుంది. పిల్లలుగా ఉన్నప్పుడు కొన్ని ఎరుపు, బ్రౌన్ కలర్స్లో కూడా ఉంటాయి. కాకపోతే... బాగా దగ్గర్నుంచి చూస్తే తప్ప ఈ తేడాలను గమనించలేం! వీటి రెక్కలు పొడవుగా, సూటిగా ఉంటాయి. ముక్కు కూడా సూటిగా ఉంటుంది. ఎగిరినప్పుడు గ్రద్దల మాదిరిగా కనిపిస్తాయివి! మగ కోకిలలు పాడలేవు. కూ అన్న కూత పెట్టేది కేవలం ఆడకోయిలలే! ఇవి గూళ్లు కట్టుకోవు. పిల్లల్ని పొదగవు. వేరే పక్షుల గూళ్లలో గుడ్లు పెడతాయి. పట్టుకు పది నుంచి 22 గుడ్లు పెడతాయి. అయితే అన్నీ ఒక గూటిలో పెట్టవు. వేర్వేరు చోట్ల పెడతాయి. ఆయా పక్షులన్నీ తమ గుడ్లతో పాటు తన గుడ్లను పొదుగుతున్నాయో లేదో గమనిస్తూ ఉంటాయి. వీటికి స్వార్థం ఎంత ఎక్కువంటే... గుడ్లు పిల్లలైన తరువాత మిగతా పక్షి పిల్లలను గూటి