How To Make Rice Roti For Healthy Morning Breakfast - Sakshi
Sakshi News home page

Rice Roti : మిగిలిపోయిన అన్నంతో రొట్టెలు.. భలే రుచిగా ఉంటాయి

Jul 22 2023 3:37 PM | Updated on Jul 22 2023 4:05 PM

How To Make Rice Roti For Healthy Morning Breakfast - Sakshi

రైస్‌ రొట్టి తయారీకి కావల్సినవి: 
మిగిలిన అన్నం – మూడు కప్పులు ; ఉల్లిపాయ తరుగు – అరకప్పు ;
క్యారట్‌ తురుము – కప్పు ; పచ్చిమిర్చి – నాలుగు (సన్నగా తరగాలి) ;
అల్లం – అంగుళం ముక్క (తురమాలి) ; కరివేపాకు – మూడు రెమ్మలు ;
కొత్తిమీర తరుగు – పావు కప్పు ; జీలకర్ర – అరటీస్పూను ; బియ్యప్పిండి – ముప్పావు కప్పు ;
ఉప్పు – రుచికి సరిపడా ; నూనె – రొట్టి వేగడానికి సరిపడా.

తయారీ విధానమిలా..

  • అన్నాన్ని నీళ్లు పోయకుండా పేస్టులా గ్రైండ్‌ చేయాలి.
  • అన్నం పేస్టుని గిన్నెలో వేసి..ఉల్లిపాయ ముక్కలు , క్యారట్‌ తురుము, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, అల్లం తరుగు, జీలకర్ర రుచికి సరిపడా ఉప్పువేసి చక్కగా కలుపుకోవాలి.
  • కొద్దిగా బియ్యప్పిండి వేసి ముద్దగా కలుపుకుని పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
  • చేతులు తడిచేసుకుని పిండిని టెన్నిస్‌ బంతి పరిమాణంలో ఉండలుగా చేయాలి.
  • ఈ ఉండలను అరిటాకు లేదా కవర్‌ మీద పెట్టి రొట్టెలా చేతితో వత్తుకోవాలి.
  • పలుచగా వత్తుకున్న రొట్టెపై అక్కడక్కడ రంధాల్రు చేయాలి.
  • ఈ రొట్టెను చక్కగా కాలిన పెనం మీద వేసి సన్నని మంట మీద కొద్దిగా నూనె వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకుని వేడివేడిగా సర్వ్‌చేసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement