ఆమ్లా ఛుందా..ఇలా చేస్తే ఎక్కువకాలం తాజాగా ఉంటుంది | How To Make Instant Amla Chunda Recipe In Telugu | Sakshi
Sakshi News home page

ఆమ్లా ఛుందా..ఇలా చేస్తే ఎక్కువకాలం తాజాగా ఉంటుంది

Published Fri, Nov 17 2023 4:37 PM | Last Updated on Fri, Nov 17 2023 4:40 PM

How To Make Instant Amla Chunda Recipe In Telugu - Sakshi

ఆమ్లఛుందా తయారీకి కావల్సినవి:

ఉసిరికాయలు – అరకేజీ; బెల్లం – అరకేజీ; అల్లం – చిన్నముక్క;
బ్లాక్‌సాల్ట్‌ – ఒకటిన్నర టీస్పూన్లు; మిరియాలు – టీస్పూను;
యాలక్కాయలు – ఎనిమిది;  దాల్చిన చెక్క – అంగుళం ముక్క;
పసుపు – టీస్పూను; కశ్మీరీ కారం – ఒకటిన్నర టీస్పూన్లు;
గరం మసాలా – అర టీస్పూను; నిమ్మకాయలు – రెండు.

తయారీ విధానమిలా:
ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, ఆవిరి మీద మెత్తగా (10 నిమిషాలు) ఉడికించాలి ∙అల్లాన్ని సన్నగా తురిమి పెట్టుకోవాలి ∙యాలక్కాయలు, మిరియాలను విడివిడిగా దంచి పెట్టుకోవాలి ∙ఉడికిన ఉసిరికాయలు చల్లారాక గింజలు తీసి సన్నగా తురుముకోవాలి.  ఉసిరి తురుములో బెల్లం వేసి మీడియం మంట మీద పెట్టాలి  అడుగంటకుండా కలుపుతూ ఉండాలి.
నీరు పైకి తేలగానే అల్లం తురుము, బ్లాక్‌ సాల్ట్, మిరియాల పొడి, యాలకుల పొడిని వేయాలి ∙దాల్చిన చెక్కను తుంచి వేయాలి ∙చివరిగా పసుపు వేసి కలుపుతూ ఉడికించాలి ∙మీడియం మంట మీదే ఉంచి కలుపుతూ మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు కారం, గరంమసాలా వేసి కలపాలి. బాగా కలిసిన తరువాత దించేసి, నిమ్మరసం పిండితే ఆమ్లా ఛుందా రెడీ.
గమనిక: గాజు లేదా పింగాణీ పాత్రల్లో నిల్వ చేస్తే ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement