మొక్కజొన్న పిండితో బిస్కెట్లు.. సింపుల్‌గా ఇలా చేసుకోండి | Best Chocolate Cookies: How To Make Corn Chocolate Chip Cookies Recipe In Telugu, Making Process Inside - Sakshi
Sakshi News home page

Corn Chocolate Chip Recipe: మొక్కజొన్న పిండితో బిస్కెట్లు.. సింపుల్‌గా ఇలా చేసుకోండి

Published Thu, Sep 14 2023 3:18 PM

How To Make Corn Chocolate Chip Cookies Recipe In Telugu - Sakshi

కార్న్‌ – చాక్లెట్‌ కుకీస్‌ తయారీకి కావల్సినవి:

బటర్‌ – 125 గ్రాములు, పంచదార – 150 గ్రాములు, 
నూనె – 80 మిల్లీ లీటర్లు, గుడ్లు – 2, ఉప్పు – తగినంత,
వనిలిన్‌ పౌడర్‌ – పావు టీ స్పూన్‌(మార్కెట్‌లో దొరుకుతుంది), మొక్కజొన్న పిండి – 80 గ్రాములు
శనగపిండి – 350 గ్రాములు, బేకింగ్‌ పౌడర్‌ – 6 గ్రాములు

తయారీ విధానమిలా:

ముందుగా బటర్, పంచదార, నూనె వేసుకుని హ్యాండ్‌ బ్లెండర్‌ సాయంతో బాగా కలుపుకోవాలి.
► అందులో గుడ్లు, ఉప్పు, మొక్కజొన్న పిండి వేసుకుని మళ్లీ కలుపుకోవాలి.
► అనంతరం వనిలిన్‌ పౌడర్, శనగపిండి, బేకింగ్‌ పౌడర్‌ వేసుకుని ముద్దలా చేసుకోవాలి.
► తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్‌లో ఉండ చేసుకుని.. దాన్ని బిస్కట్‌లా ఒత్తుకుని.. పైభాగంలో నచ్చిన షేప్‌ని ప్రింట్‌ చేసి.. బేక్‌ చేసుకోవాలి.
► అభిరుచిని బట్టి రెండేసి కుకీస్‌ తీసుకుని.. మధ్యలో చాక్లెట్‌ క్రీమ్‌ పెట్టుకుని సర్వ్‌ చేసుకోవచ్చు. 

Advertisement
 
Advertisement
 
Advertisement