
వర్షాలు పడుతున్న వేళ రోజువారీ కార్యకలాపాల కోసం రోడ్ల మీద తిరిగే వారికి జుట్టు తడవడం సర్వసాధారణం. అయితే సరైన జాగ్రత్తలు, సంరక్షణ తీసుకోకపోతే మాత్రం దాని ప్రభావం అంత సాదా సీదాగా ఉండదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏమీ కాదులే అని తడిసిన జుట్టును వదిలేస్తే.. అపార నష్టం కలుగవచ్చునని స్పష్టం చేస్తున్నారు. వర్షాల సీజన్‌లో తల వెంట్రుకలను ఎలా కాపాడుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనిపై పలువురు స్కిన్–హెయిర్ కేర్ నిపుణులు అందిస్తున్న సూచనల సమాహారం ఇది..
వర్షాకాలం ప్రభావం కేశాల మీద చాలా ఎక్కువగా ఉంటుంది, వర్షపు నీటిలోని కాలుష్య కారకాల వల్ల జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి, మీ జుట్టు సంరక్షణ పద్ధథులను మార్చుకోవాలి. తలని పరిశుభ్రంగా పొడిగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. తేలికపాటి షాంపూతో క్రమం తప్పకుండా కడగడం, కండిషనింగ్ చేయడం అవసరం.
హెయిర్ మాస్క్‌లను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం పొడిబారడం వంటివి నివారించవచ్చువర్షపు నీటికి ఉండే ఆమ్ల స్వభావం జుట్టును దెబ్బతీస్తుంది, కాబట్టి బయటకు వెళ్లే సమయంలో లేదా వర్షపు సమయంలో తలను గొడుగు, టోపీ లేదా స్కార్ఫ్‌తో కప్పడం చాలా అవసరం. (కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు!)
జుట్టు తడిసినట్టయితే కాలుష్య కారకాలను తొలగించడానికి వీలైనంత త్వరగా తేలికపాటి షాంపూ కండిషనర్‌తో జుట్టును కడగాలి.
రుతుపవనాల తేమ తలని జిడ్డుగా మారుస్తూ రకరకాల ఇన్ఫెక్షన్లకు గురి చేస్తుంది. అదనపు నూనె ధూళిని తొలగించడానికి తేలికపాటి, సల్ఫేట్ లేని షాంపూతో జుట్టును క్రమం తప్పకుండా (వారానికి 2–3 సార్లు) కడగాలి.
టీ ట్రీ ఆయిల్ లేదా వేప నూనెతో కూడిన షాంపూలను వాడటం మరింత ఉపయుక్తం ఎందుకంటే ఇవి యాంటీ ఫంగల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. (కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ మరణంపై తల్లి సంచలన ఆరోపణలు)
ప్రతి హెడ్ వాష్ తర్వాత జుట్టును కండిషన్ చేయాలి. తద్వారా జుట్టు బిరుసు తనాన్ని నియంత్రించవచ్చు తేమను జోడించవచ్చు.
జుట్టును తేమగా మార్చడానికి బలోపేతం చేయడానికి వారానికి ఒకసారి డీప్ కండిషనింగ్ ట్రీట్‌మెంట్ లేదా హెయిర్ స్పా ఉపయోగించవచ్చు
జుట్టు కడుక్కోవడానికి ముందు నూనె రాయడం ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ ఎక్కువసేపు నూనె ఉంచడం సరికాదు.. ఎందుకంటే అది మురికిని ఆకర్షిస్తుంది.
అధిక తేమ వల్ల జుట్టు విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి హెయిర్ డ్రైయర్లు స్ట్రెయిటెనర్‌లు వంటి హీట్ స్టైలింగ్ సాధనాల వాడకాన్ని తగ్గించండి. వేడిని ఉపయోగించాల్సి వస్తే, హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే బెటర్.
పుష్కలంగా పండ్లు, కూరగాయలు నీటితో కూడిన సమతుల్య ఆహారం ఆరోగ్యకరమైన జుట్టుకు దోహదం చేస్తుంది.
ఆహారంలో ఆమ్లా (ఇండియన్ గూస్బెర్రీ)భాగం చేయండి. ఎందుకంటే ఇందులో జుట్టుకు మేలు చేసే విటమిన్ సి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.