మొబైల్, లేదా బుల్లితెర వ్యసనం (స్క్రీన్ అడిక్షన్) మీ మెదడును కుంచించుకుపోయేలా చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సందర్భంగా, పబ్జీ గేమ్ వ్యసనానికి గురై, తిరిగి బయటకు వచ్చిన ఒక యువకుడి స్ఫూర్తిగాధ మీకోసం
స్క్రీన్ అడిక్షన్ ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఆయుర్వేద సూచనలు
"నేను 24 గంటలు నిరంతరాయంగా పబ్జీ గేమ్ ఆడేవాడిని. కాలేజీ చదువున మధ్యలో వదిలేశాను. ఐదు నిమిషాలు కూడా ప్రశాంతంగా కూర్చోలేకపోయేవాడిని," అని 25 ఏళ్ల చెన్నారెడ్డి చెబుతున్నాడు. ఇప్పుడు ఆయన పగలు సౌరశక్తి టెక్నీషియన్‌గా పని చేస్తూ, యోగా బోధిస్తున్నాడు. మరి ఆయనలో మార్పు ఎలా వచ్చింది?
స్టాన్‌ఫర్డ్ లైఫ్‌స్టైల్ మెడిసిన్ చేసిన పరిశోధన ప్రకారం, రోజుకు రెండు గంటలకుపైగా కాలక్షేపం కోసం మొబైల్ చూసే 18–25 ఏళ్ల వయస్సు గల వ్యక్తుల్లో మెదడులోని సెరెబ్రల్ కార్టెక్స్ మందం తగ్గిపోతుంది. మెదడులోని ఈ భాగం నిర్ణయాలు తీసుకోవడం, జ్ఞాపకశక్తి, సమస్యల పరిష్కారం వంటి ముఖ్యమైన పనులకు బాధ్యత వహిస్తుందని మనం గుర్తించాలి.
రోజుకు ఐదు గంటలకంటే ఎక్కువ స్క్రీన్ ముందు గడిపే పెద్దవారికి చిత్తభ్రమ, పక్షవాతం, పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ వ్యసనం మెదడులోని గ్రే మ్యాటర్ పరిమాణాన్ని కూడా తగ్గిస్తుంది—ఇది కదలికల నుంచి భావోద్వేగాల వరకు అన్నింటిని నియంత్రిస్తుంది. స్క్రీన్‌ల నుంచి వచ్చే నీలి కాంతి మెలటోనిన్ ఉత్పత్తిని అణచి, సహజ నిద్ర చక్రాన్ని దెబ్బతీస్తుంది.
ఇది మనసిక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది - ఆందోళన, నిరాశ, నలుగురితో కలవకపోవటం వంటివి పెరుగుతాయి. డా. మణికంటన్ చెప్పినట్లుగా, “ఇప్పుడైనా ఒక అడుగు వెనక్కి వేసి, మన స్క్రీన్ అలవాట్లను నిజాయితీగా పరిశీలించాల్సిన సమయం వచ్చింది.”
స్క్రీన్ అలవాటును తగ్గించడానికి ఆయుర్వేద సూచనలు
స్క్రీన్ వినియోగం ఎక్కువగా ఉందని గుర్తించినవారికి డా. మణికంటన్ కొన్ని ప్రాయోగిక సూచనలు అందిస్తున్నారు:
మీ ఇంట్లో కొన్ని ప్రాంతాలను బుల్లితెరకు, ఫోన్లకు నిషేధిత ప్రాంతాలుగా ఏర్పరచండి: ఇంట్లో భోజనపు టేబుల్, పడకగది వంటి ప్రదేశాలలో ఇవి లేకుండా చేయటం అనేది మన మనస్సును వర్తమానంలోకి తెస్తుంది.
ఫోన్ లేదా టీవీ ఎంతసేపు చూడాలనే టైమ్ టేబుల్ ముందే వేసుకోండి: అవసరమైనప్పుడు మాత్రమే ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ఉపయోగించండి. ఇది అలవాటుపై నియంత్రణ పెంచుతుంది.
ఎంతసేపు వాటిని వినియోగిస్తున్నారనేది గమనించుకోండి: దానికోసం మొబైల్‌లోనే అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా మీరు ఎంతసేపు ఉపయోగిస్తున్నారో గమనించండి. ఇది మార్పుకు ప్రేరణ ఇస్తుంది.
సరైన శ్వాసకు గల శక్తి: కేవలం గాలి పీల్చుకోవటం కాదు, ప్రాణశక్తిని పెంపొందించుకోవటం
చెన్నా రెడ్డి కథ, స్క్రీన్ వ్యసనంలో చిక్కుకున్న యువతకు ఆశ చూపుతుంది. 24 గంటల పాటు గేమింగ్, కోపం, చదువు మధ్యలో ఆగిపోవడం—ఇలాంటి పరిస్థితుల్లో ఆయన 2023 జనవరిలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించే యువనాయకత్వ శిక్షణ కార్యక్రమంలో చేరాడు.
అక్కడ ఆయన సుదర్శన్ క్రియ అనే శక్తివంతమైన శ్వాసక్రియ సాధన నేర్చుకున్నాడు. ఈ సాధనాన్ని ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు, మానవతా నాయకుడు గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్ పరిచయం చేశారు. ఇది శరీరంలోని ఒత్తిడిని తగ్గించి, మనస్సులోని పాత అలవాట్లను విడిపిస్తుంది.
కొద్ది రోజుల్లోనే చెన్నా రెడ్డి కోపం తగ్గిపోయింది, స్క్రీన్‌పై ఉన్న ఆకర్షణ క్రమంగా తగ్గింది, మనస్సులో ప్రశాంతత ఏర్పడింది. తరువాత ఆయన తన చదువును 70% మార్కులతో పూర్తి చేసి, యోగా ఉపాధ్యాయుడిగా మారి, సౌరశక్తి రంగంలో కెరీర్ నిర్మించుకున్నాడు.
అధికంగా స్క్రీన్ వినియోగిస్తే, దాని ఫలితంగా చాలా సార్లు ఒత్తిడి లేదా ఆందోళన కలుగుతాయి. సుదర్శన క్రియ మన నాడీ వ్యవస్థను సమతుల్యం చేసి, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది డోపమైన్ ఆధారిత అలవాట్లను కూడా నియంత్రిస్తుంది. స్క్రీన్ వ్యసనం కూడా ఇతర వ్యసనాల్లాగే ఉంటుంది; ఈ సాధన వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆయుర్వేద సహాయం
నస్య చికిత్స: ముక్కులో ఔషధ తైలాన్ని వేసే విధానం. ఉదయం కొన్ని చుక్కలు ‘అణు తైలం’ ఉపయోగించడం మెదడుకు పోషణనిచ్చి, డిజిటల్ అలసటను తగ్గిస్తుంది.
మేధ్య రసాయన: బ్రాహ్మి, అశ్వగంధ, శంఖపుష్పి వంటి మూలికలతో చేసిన ఈ ఔషధం ఏకాగ్రతను పెంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది.
జీవనశైలిలో మార్పులు
ప్రతి ఉదయం 15 నిమిషాలు ధ్యానం చేయండి.
స్క్రీన్‌కు బదులుగా పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, పెయింటింగ్, నడక, ఇరుగుపొరుగువారితో మాట్లాడటాన్ని అలవాటు చేసుకోండి.
ఇవి మెదడుకు సహజ ఆనందాన్ని ఇస్తాయి. క్రమంగా స్క్రీన్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి.
డా. నిషా మణికంటన్, BAMS, MD (AM)
ఆయుర్వేద వైద్యురాలు రచయిత సీనియర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ అంతర్జాతీయ డైరెక్టర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వెల్‌నెస్ ప్రోగ్రామ్స్
(చదవండి:


