ప్రాన్స్‌ కార్న్‌ ఫ్రిటర్స్‌ | Sakshi
Sakshi News home page

ప్రాన్స్‌ కార్న్‌ ఫ్రిటర్స్‌

Published Sun, Sep 10 2023 2:09 PM

French Corn Fritters Recipe Making Process - Sakshi

కావలసినవి:  చిక్కటి పాలు – పావుకప్పు, గుడ్లు – 4, మొక్కజొన్న పిండి – అర కప్పు, బియ్యప్పిండి – పావు కప్పు, రొయ్యలు – 20 లేదా 25 (ఉప్పు, కారం, మసాలా కలిపి ఉడికించి పక్కన పెట్టుకోవాలి), స్వీట్‌ కార్న్‌ – రెండున్నర కప్పులు (ఉడికించి మిక్సీ పట్టుకోవాలి), ఉల్లిపాయ ముక్కలు –2 టేబుల్‌ స్పూన్లు (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి – 2 (చిన్న ముక్కలుగా తరగాలి), కొత్తిమీర తురుము – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా


తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో పాలు, మూడు గుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి వేసుకుని మరోసారి కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో స్వీట్‌ కార్న్‌ గుజ్జు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని, ఉడికించిన ఒక్కో రొయ్యతో కలిపి.. చేత్తో చిన్నగా ఒత్తి, వడలుగా చేసుకుని, నూనెలో దోరగా వేయించుకోవాలి.  

(చదవండి: ఓట్స్‌ – యాపిల్‌ లడ్డూలు)

Advertisement
 
Advertisement