అత్యంత విశిష్టమైన ఏకాదశి | Ekadashi Holds Great Significance In Hindu Tradition | Sakshi
Sakshi News home page

అత్యంత విశిష్టమైన ఏకాదశి

Jul 9 2026 9:43 AM | Updated on Jul 9 2026 11:53 AM

Ekadashi Holds Great Significance In Hindu Tradition

జూలై  11, శనివారం వైష్ణవ యోగిని ఏకాదశి

హిందూ సంప్రదాయంలో ఏకాదశిది ఎంతో విశిష్ట స్థానం. వాటిలో జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని మరింత ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువుతోపాటు మహాలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే పాపాలు తొలగి, పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. ఉపవాసం, పూజలు, జపం, దానం వంటి ధార్మిక కార్యాలను ఆచరించడం వల్ల ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతుందని పురాణాలు పేర్కొంటాయి.

ఈ వ్రతం వేలాదిమందికి అన్నదానం చేసినంత ఫలాన్నిస్తుందని ప్రతీతి. తులసిని‘హరిప్రియ’గా పిలుస్తారు. అంటే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన మొక్క. అందుకే తులసి లేకుండా విష్ణుపూజ అసంపూర్ణమని సంప్రదాయం చెబుతోంది. యోగిని ఏకాదశి రోజున తులసిని భక్తితో పూజించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం, సానుకూల వాతావరణం పెరుగుతాయని విశ్వాసం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement