లూపస్ వ్యాధి గురించి తెలుసా? చికిత్స లేకపోతే ఎలా?! | Do You Know About What Is Lupus? Check Its Signs, Symptoms, And Causes Here | Sakshi
Sakshi News home page

లూపస్ వ్యాధి గురించి తెలుసా? చికిత్స లేకపోతే ఎలా?!

Feb 5 2025 2:25 PM | Updated on Feb 5 2025 3:36 PM

Do you know  about Lupus Signs and Symptoms check here

దీర్ఘకాలికమైన, సంక్లిష్టమైన ఆటో ఇమ్యూన్‌ వ్యాధి ఒకటి ఉంది దాని పేరే లూపస్. ఇది శరీరంలోని ఏ భాగాన్ని అయినా ప్రభావితం చేస్తుంది. కళ్ళు, చర్మం, మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు,రక్త నాళాలు సాధారణంగా ప్రభావితమయ్యే భాగాలు.  ఇందులో చాలా రకాలు ఉన్నాయి. వీటిల్లో అత్యంత సాధారణమైన రకాన్ని సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసస్(SLE) అని పిలుస్తారు. చ‌ర్మంపై ద‌ద్దుర్లు, కండ‌రాలు బ‌ల‌హీన‌త, కీళ్ల‌ వాపు ఇలా శ‌రీరంలోని  ఏదో ఒక స‌మ‌స్య‌కు గురి చేస్తుంది.  అసలు లూపస్‌ లక్షణాలు ఏంటి?  ఎవర్ని ఎక్కుగా బాధించే అవకాశం ఉంది? తెలుసుకుందాం.

ఎవరికి లూపస్ వచ్చే అవకాశం ఎక్కువ?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌తి 1000 మందిలో ఒక‌రు ల్యూప‌స్ వ్యాధితో బాధ‌ప‌డుతన్నట్టు తెలుస్తోంది. మ‌న‌దేశంలో ప్ర‌తి ల‌క్ష మందిలో 3.2 మంది ల్యూప‌స్ బారిన ప‌డ్డార‌ని అంచ‌నా. ఎవరికైనా లూపస్ రావచ్చు, కానీ ఈ వ్యాధి ఎక్కువగా మహిళలను ప్రభావితం చేస్తుంది. వాస్తవానికి, ఈ వ్యాధి ఉన్న 10 మంది పెద్దలలో 9 మంది మహిళలు ఉన్నారు. ఇది శ్వేతజాతి మహిళలకంటే ఆఫ్రికన్ అమెరికన్, హిస్పానిక్, ఆసియన్ , స్థానిక అమెరికన్ సంతతికి చెందిన మహిళల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది.  

చర్మసంబంధమైన లూపస్‌: చర్మంపై దద్దుర్లు లేదా  పుండ్లు వస్తాయి. సాధారణంగా బాగా ఎండధాటికి గురైనపుడు వస్తుంది. అయితే కొన్ని మందులకు  రియాక్షన్‌ వల్ల కూడా ఇది రావచ్చు. సంబంధిత  ఔషధం ఆపివేసిన తర్వాత లక్షణాలు తగ్గిపోతాయి.

నియోనాటల్ లూపస్ : ఇది   శిశువు తన తల్లి నుండి ఆటోఆంటిబాడీలను పొందినప్పుడు సంభవిస్తుంది (ఆటో యాంటిబాడీలు అనేవి రోగనిరోధక ప్రోటీన్లు, ఇవి పొరపాటున ఒక వ్యక్తి  సొంత కణజాలాలను లేదా అవయవాలను లక్ష్యంగా చేసుకుని ప్రతిస్పందిస్తాయి). చర్మం, కాలేయం   లూపస్‌ వ్యాధికి  సరైన చికిత్స తీసుకుంటే  ఆరు నెలల్లోనే  నయమయ్యే అవకాశాలున్నాయి. 

ల్యూప‌స్ - లక్షణాలు 

ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో ఒక‌టి ల్యూప‌స్‌.  మన శరీరంలోని వ్యాధి నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ బలహీనపడినపుడు ఇది దాడి చేస్తుంది.

మన ముందే చెప్పుకున్నట్టు ఇమ్యూనిటీ  పవర్‌ తగ్గిన సందర్బంలో  ఏ అవయవాన్నైనా  ల్యూప‌స్ వ్యాధి సోకుతుంది. సాధార‌ణంగా చ‌ర్మం, జుట్టు, కీళ్లు, కండ‌రాలు, ఎముక‌లు దీనివ‌ల్ల ప్ర‌భావిత‌మ‌వుతాయి. అందుకే చ‌ర్మంపై ద‌ద్దుర్లు, జుట్టు రాలిపోవ‌డం, కీళ్ల‌లో వాపులు, ఎముక‌ల నొప్పులు, కండ‌రాల ప‌టుత్వం త‌గ్గిపోతుంది. ఒక్కోసారి జ్వ‌రం  కూడా రావచ్చు. లూపస్ ఉన్నవారిలో దాదాపు 50–90శాతం మందిలో తీవ్రమైన అలసట ఉంటుంది.   ముఖంమీద బటర్‌ ఫ్లై  ఆకారంలో ర్యాషెస్‌, నోట్లో పుండ్లు రావచ్చు. జుట్టు ఊడిపోతుంది.  ఛాతీలో చొప్పి, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాచి. 

నాడీ వ్య‌వ‌స్థ కూడా ప్ర‌భావితమైతే ఆటో ఇమ్యూన్ క‌ణాలు మెద‌డు పొర‌లపై దాడిచేస్తాయి. దీంతో వాపు లేదా ఇన్ ఫ్ల‌మేష‌న్ లక్షణాలు కనిపిస్తాయి. ల్యూప‌స్ వ్యాధి సోకిన మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలొస్తాయి.  అప్పటికే గర్భవతులుగా ఉంటే గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. కిడ్నీలు ప్ర‌భావిత‌మైతే కిడ్నీ ఫెయిల్యూర్ కి దారితీస్తుంది.


నిర్ధార‌ణ  ఎలా?
క్లినికల్‌ పరీక్షలు, రక్త పరీక్షలతో సహా పూర్తి వైద్య చరిత్ర ,శారీరక పరీక్షను  నిర్వహించాలి.. రోగ నిర్ధారణ చేయడానికి వైద్యుడు చర్మం మరియు మూత్రపిండాల బయాప్సీలు (యాంటీ న్యూక్లియ‌ర్ యాంటీబాడీస్ (ఎఎన్ఎ) అనే ప‌రీక్ష ద్వారా  లూపస్‌ వ్యాధిని  నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. రోగి లక్షణాలు,  ఏ అవయవానికి సోకింది అనేదానిపై ఆధారణపడి బయాప్సీ,  కిడ్నీ ఫంక్ష‌నింగ్ టెస్టు, బ్రెయిన్ సిటి స్కాన్ లాంటి పరీక్షల ద్వారా వైద్యులు నిర్దారిస్తారు.
 
చికిత్స ఏంటి?
నిజం చెప్పాలంటే ల్యూప‌స్ వ్యాధికి శాశ్వ‌త చికిత్స అంటూ   ఏమీ లేదు.  ఉపశమన చికిత్స మాత్రమే.   సోకిన అవయవం,ల‌క్ష‌ణాల‌ ఆధారంగా మాత్ర‌మే చికిత్స  ఉంటుంది ఏయే అవ‌య‌వాల‌పై వ్యాధి ప్ర‌భావం ఉంద‌నే దాన్ని బ‌ట్టి  రుమటాలజిస్ట్ , నెఫ్రాలజిస్ట్ (మూత్రపిండ వ్యాధి), హెమటాలజిస్ట్ (రక్త రుగ్మతలు), చర్మవ్యాధి నిపుణుడు (చర్మ వ్యాధులు), న్యూరాలజిస్ట్ (నాడీ వ్యవస్థ), కార్డియాలజిస్ట్ (గుండె, రక్తనాళ సమస్యలు)  ఎండోక్రినాలజిస్ట్ (గ్రంధులు మరియు హార్మోన్లు)ను సంప్రదించాల్సి ఉంటుంది.  

నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో నాన్ స్టిరాయిడ‌ల్ యాంటీ ఇన్‌ఫ్లమేట‌రీ మందులు తీసుకోవాలి. ఇమ్యూనిటీని పెంచుకునే ఆహారాన్ని విరివిగా తీసుకోవాలి. దీంతో పాటు,  సమతులం ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడి లేని జీవితం,సరియైన నిద్ర చాలా అసవరం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement