రాళ్ల ఉప్పుకి మాములు ఉప్పుకి ఇంత తేడానా? ఆ వ్యాధులకు కారణం ఇదేనా?

Difference Between Rock Salt And Common Salt Which One Is Better - Sakshi

మాములుగా ప్యాకెట్లలో దొరికే సాల్ట్‌కి రాక్‌ సాల్ట్‌కి తేడా ఏంటో చాలామందికి తెలియదు. దీనికి తోడు టీవీల్లో ప్యాకెట్‌ సాల్ట్‌ చాలా మంచిది అని ఇచ్చే అడ్వర్టైస్‌మెంట్ల కారణంగా వాటినే వాడేస్తుంటారు. అయితే అది క్రిస్టల్‌గా ఉండదు కాబట్టి ఈజీగా కరిగిపోతుంది అనుకుంటారు. ఆయుర్వేద పరంగా రాళ్ల ఉప్పే మంచిదని చెబుతుంటారు. ఇంతకీ ఏది మంచిది? మార్కెట్లో దొరికే ప్యాకెట్‌ ఉప్పు వాడకూడదా?

ప్యాకెట​ సాల్ట్‌ యంత్రంలో శుద్ధి అవుతుంది. దీనికి సోడియం, క్లోరైడ్, అయెడిన్ అనే మూడింటి తోపాటు అందంగా కనిపించేలా కృత్రిమ రసాయనాలను కలిపి తయారు చేస్తున్నారు. అందువల్ల దీన్ని వాడటం వల్ల గాయిటర్‌, గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటుకి కారణంగా కూడా ఈ ప్యాకెట్‌ ఉప్పు వల్లనే అని తేల్చారు. మాములు ఉప్పులో 97% సోడియం క్లోరైడ్‌, 3% ఇతర మూలకాలు ఉంటాయి. ఇక రాతి ఉప్పు లేదా రాక్‌సాల్ట్‌/ రాళ్ల ఉప్పు సముద్రం లేదా ఉప్పు నీటి సరస్సుల నుంచి తయారు చేస్తారు. 

ఈ రాతి ఉప్పు ముతకగా ఉంటుంది. ఇందులో దాదాపు 85% సోడియం క్లోరైడ్ ఉంటుంది. ఇక మిగిలిన 15%.. ఇనుము, రాగి, జింక్, అయోడిన్, మాంగనీస్, మెగ్నీషియం, సెలీనియం మొదలైన ఖనిజాలతో సహా సుమారు 84 రకాల మూలకాలు ఉంటాయి. ఈ ఖనిజాలు శరీరానికి మేలు చేస్తాయి. ఈ రాళ్ల ఉప్పులో అయోడిన్‌ని కలపాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ సాధారణ ఉప్పులో మాత్రం అయోడిన్‌ కలపాల్సి ఉంటుంది. అలాగే బ్లాక్‌ సాల్ట్‌లో కూడా రాక్‌సాల్ట్‌ మాదిరిగానే దీనిలో ఎన్నో ఖనిజాలు ఉ‍న్నాయి. 

ఈ రాళ్ల ఉప్పు వల్ల కలిగే ప్రయోజనాలు..

  • వివిధ రకాల ఖనిజాలను కలిగి ఉండటం వల్ల, రాతి ఉప్పు అనేక వ్యాధులను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇది చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
  • సాధారణ ఉప్పును అధికంగా ఉపయోగించడం వలన అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువుగా ఉంటుంది. 
  • ఇది సైనస్ చికిత్సలో సహాయపడుతుంది. ఈ రాతి ఉప్పు లేదా రాళ్ల ఉప్పు సరైన క్యాంటిటీలో ఉపయోగిస్తే అధిక బరువు సమస్య ఉండదు.
  • నిద్రలేమి లేదా ఇతర నిద్ర సంబంధిత సమస్యలు ఉన్నవారు రాళ్ల ఉప్పును ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
  • కొంతమంది రాతి ఉప్పును బాడీ స్క్రబ్‌గా కూడా ఉపయోగిస్తారు. ఇది చర్మ హైడ్రేషన్‌ను సమర్ధవంతంగా మెరుగుపరుస్తుంది. 
  • రాక్ సాల్ట్ చిగుళ్ళను శుభ్రం చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. 
  • మైగ్రేన్ నొప్పికి కారణమయ్యే మెగ్నీషియం లోపాన్ని కూడా రాక్ సాల్ట్ భర్తీ చేస్తుంది. 
  • మలబద్ధకాన్ని నివారించి జీర్ణ సంబంధిత సమస్యలను మెరుగుపరుస్తుంది. 

(చదవండి: త​క్కువ వ్యాయమమే మంచి ఫలితాలిస్తుంది!పరిశోధనల్లో షాకింగ్‌​ విషయాలు)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top