బియ్యం, మినప్పుతో పనిలేకుండా క్షణాల్లో దోసె చేసేయండిలా..! | Celebrity Chef Kunal Kapoor's Dosa Making Method In Less Time | Sakshi
Sakshi News home page

ఉన్నఫలంగా దోసె తినాలనిపిస్తోందా? అయితే ఇలా చేయండి..!

May 26 2026 11:05 AM | Updated on May 26 2026 12:24 PM

Celebrity Chef Kunal Kapoor's Dosa Making Method In Less Time

మీరు ఇప్పటివరవకు ప్లెయిన్ దోసె నుంచి చీజ్, పనీర్ దోసల వరకు రుచి చూసి ఉంటారు. కానీ ఉన్నఫలంగా దోసె తినాలనిపించినప్పుడు.. తగిన పిండి, పులియబెట్టడంవంటి ప్రక్రియ ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి పరిస్థితిలో దోసను మార్కెట్‌కు వెళ్లి లేదా ఆర్డర్ చేసి మాత్రమే తినగలం. కానీ పిండి అవసరం లేని ఈ దోస వంటకాన్ని ప్రముఖ చెఫ్ కునాల్ కపూర్ మనతో పంచుకున్నారు.

ఇందులోని ప్రత్యేకత ఏమిటంటే? ఈ దోసె తయారీకి బియ్యం, పప్పులు, పిండి పదార్థాలు అవసరం లేదు. దీనికోసం కేవలం పాపడ్, నీళ్లు, నెయ్యి ఉంటే చాలు. పులియబెట్టే ప్రక్రియ లేకుండానే.. నిమిషాల్లో సూపర్ క్రిస్పీ 'పాపడ్ దోసె'ను తయారు చేసుకోవచ్చు. వైరల్ అవుతున్న ఈ రెసిపీతో కమ్మని రుచిని ఆశ్వాదించవచ్చు. క్షణాల్లో మీ ముందుండే ఈ పాపడ్ దోసెను ఎలా తయారు చేయాలో చూద్దాం!

కావలసినవి:
- పాపడ్
- నీరు
- నెయ్యి

తయారుచేసే విధానం:
1. ముందుగా పాపడ్‌ను కత్తెరతో గానీ, చేతితో రెండు భాగాలుగా విరవండి.
2. వాటిని నీటిలో వేసి కాసేపు నానబెట్టాలి. దీంతో పాపడ్ పూర్తిగా మెత్తగా అవడంతోపాటు కొద్దిగా జిగురుగా మారుతుంది.
3. నానబెట్టిన పాపడ్‌ను మిక్సర్ గ్రైండర్‌లో వేసి మెత్తని పేస్ట్ లాగా అయ్యేంత వరకు బాగా గ్రైండ్ చేయాలి. ఇదే మీ తక్షణ దోసె పిండి.
4. ఒక బాణలిని వేడి చేసి, దానిపై కొద్దిగా నీళ్ళు చల్లి, గరిటెతో పిండిని పోసి దోసెలాగా పలుచగా పరచాలి.
5. అవసరమైతే కారం, ఉల్లిపాయలు ‍కలిపి, పైన కొద్దిగా నెయ్యి వేసి దోసెను బాగా కాల్చండి. దీంతో.. కరకరలాడే పాపడ్‌ దోసె రెడీ. దీనిని చట్నీలో, సాంబార్‌తో కూడా వేడివేడిగా తినవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement