ఎలక్ట్రిక్‌ మినీ మిక్సర్‌: మిల్క్‌షేక్‌ల నుంచి చిన్న పిల్లల ఆహారం వరకు ఏదైనా..!

Blender Grinder Mixer Rechargeable Mini Juicer - Sakshi

చిత్రంలోని  4 ఇన్‌ 1 ఎలక్ట్రిక్‌ మినీ గార్లిక్‌ చాపర్‌ మిక్సర్‌.. పిల్లలకు, పెద్దలకు భలే ఉపయుక్తంగా ఉంటుంది. ఇందులో ఐస్‌ క్రీమ్, సోయా మిల్క్, ఫ్రెష్‌ జ్యూస్, వెజిటబుల్‌ జ్యూస్, మిల్క్‌ షేక్స్‌ వంటివే కాదు.. పసిపిల్లలకు మెత్తటి ఆహారం, ఫేస్‌ మాస్క్‌ కోసం మెత్తటి మిశ్రమాన్నీ తయారు చేసుకోవచ్చు. దీనిలో 3 పదునైన బ్లేడ్స్‌ ఉంటాయి. సమయాన్ని ఆదా చేస్తుంది. ఇది పండ్లు, కూరగాయలతో పాటు మాంసాన్నీ కచ్చాబిచ్చాగా చేయగలదు.

స్కూల్లో, ఆఫీసుల్లో, జిమ్‌లో, క్యాంపింగ్‌లో ఇలా ప్రతిచోటా.. చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని 3 నుంచి 4 గంటల పాటు చార్జింగ్‌ పెడితే చాలు. కావాల్సిన విధంగా వాడుకోవచ్చు. ఈ బాటిల్‌ రెండువైపులా ఓపెన్‌ అవుతుంది. దాంతో క్లీనింగ్‌ సులభమవుతుంది. బాటిల్‌ కింద వైపు ఉన్న బటన్‌ని ప్రెస్‌ చేసుకుంటే... ఇది ఆన్‌ ఆఫ్‌ అవుతుంది.  

(చదవండి: హెల్తీగా రాగి డోనట్స్‌ చేసుకోండిలా..!)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top