ఫ్రెండ్లీ బెంగళూరు | Bengaluru topped the list with a city inclusion score | Sakshi
Sakshi News home page

ఫ్రెండ్లీ బెంగళూరు

Apr 11 2026 6:09 AM | Updated on Apr 11 2026 6:10 AM

Bengaluru topped the list with a city inclusion score

స్టడీ 

సామాజిక అంశాలలో మహిళల భాగస్వామ్యం, భద్రత, వృత్తిపరమైన అంశాలు... మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకొని నగరాలను మూల్యాంకనం చేసి టాప్‌ సిటీస్‌ ఫర్‌ విమెన్‌ ఇన్‌ ఇండియా  (టీసిడబ్ల్యూ) ఒక నివేదికను రూపొందించింది. నగరాలకు ర్యాంకులు ఇచ్చింది...

→ కీలక అంశాలైన సోషల్‌ ఇన్‌క్లూజన్‌ స్కోర్‌ (ఎస్‌ఐఎస్‌), ఇండస్ట్రియల్‌ ఇన్‌క్లూజన్‌ స్కోర్‌ (ఐఐఎస్‌) ఆధారంగా ర్యాంక్‌లు ఇస్తారు. ‘ఎస్‌ఐఎస్‌’ అనేది సమాజంలో మహిళల ప్రాతినిధ్యం, భద్రత, జీవన యోగ్యతలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇక ‘ఐఐఎస్‌’ మహిళల ఉద్యోగావకాశాలు, ప్రాతినిధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది.

→ మహిళల భద్రతా, ఉద్యోగావకాశాలు, జీవన విధానం వంటి కారణాల వల్ల బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. 53.2 సిటీ ఇంక్లూజన్‌ స్కోర్‌ (సీఐఎస్‌) సాధించింది.
మెరుగైన పోలీసింగ్‌ నుండి మెరుగైన ప్రజా మౌలిక సదుపాయల వరకు, బెంగళూరు ఉమెన్‌–ఫ్రెండ్లీ పట్టణ జీవనానికి బెంచ్‌మార్క్‌గా నిలిచింది

→ చెన్నై 49.8  సీఐఎస్‌ స్కోర్‌తో రెండవ స్థానంలో నిలిచింది. భద్రతా, ప్రజా రవాణా, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి అంశాలలో రాణించింది.

→ పుణే (46.2), హైదరాబాద్‌ (46), ముంబై(44.4) మొదటి అయిదు స్థానాల్లో నిలిచాయి. 

→ ఈ సంవత్సరం అత్యంత వేగంగా పురోగమించిన నగరాల్లో గురుగ్రామ్‌ ఒకటి.  

→ దిల్లీ, గురుగ్రామ్, నోయిడా వంటి నగరాలు మహిళలకు వృత్తిపరమైన అవకాశాలు అందించినప్పటికీ, భద్రత, ధరలు, రోజువారీ రవాణా సౌకర్యాల విషయంలో వెనకబడి ఉన్నాయి.

→ సోషల్‌ ఇన్‌క్లూజన్‌ స్కోర్‌(ఎస్‌ఐఎస్‌), ఇండస్ట్రీయల్‌ ఇన్‌క్లూజన్‌ స్కోర్‌(ఐఐఎస్‌)... ఈ రెండు అంశాల మధ్య సమతుల్యత పాటించడంలో కోల్‌కతా, హైదరాబాద్, పుణేలాంటి కొన్ని నగరాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. సామాజిక, పారిశ్రామిక సమ్మిళితత్వం నిరంతరం కలిసి సాగుతూ మహిళల ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తున్నాయి,

ముంబైలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ముంబై అత్యధిక పారిశ్రామిక సమ్మిళిత స్కోర్‌ ఉన్నప్పటికీ, దాని సామాజిక సమ్మిళిత స్కోర్‌ 38.44తో వెనకబడి ఉంది. పుష్కలమైన ఉద్యోగావకాశాలు ఉన్నప్పటికీ అధిక జీవన వ్యయాలు, మౌలిక సదుపాయాల కొరత వంటి సమస్యలు ఉన్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement