Beauty Tips: క్యారెట్‌, నిమ్మకాయ, ఆలుగడ్డ.. మచ్చల్ని తరిమికొట్టే హోంమేడ్‌ క్రీమ్‌!

Beauty Tips: Carrot Lemon Potato Home Made Cream Remove Black Spots - Sakshi

Home Remedies for Black Spots on Face: క్యారెట్, నిమ్మకాయ, బంగాళ దుంప ఒక్కోటి తీసుకుని శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడుచుకోవాలి. తరువాత  ఈ మూడింటిని తొక్క తీయకుండా సన్నగా తురుముకోవాలి. వీటన్నిటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలిపి 24 గంటలపాటు మూతపెట్టి ఉంచాలి.

తరువాత గిన్నెలో ఉన్న తురుమును వడగట్టి నీటిని వేరు చేసి ఒక గిన్నెలో మూడు టేబుల్‌ స్పూన్ల అలోవెరా జెల్, వడగట్టి పెట్టుకున్న రసం మూడు టీస్పూన్లు వేసి, కొద్దిగా బాదం నూనెవేసి పేస్టులా కలుపుకోవాలి.

చివరిగా ఈ విటమిన్‌ క్యాప్యూల్స్‌ ఒకటి వేసి కలిపితే క్రీం రెడీ అయినట్లే. దీనిని గాజు సీసాలో స్టోర్‌ చేసుకుని రోజూముఖానికి రాసుకుంటే నల్లని మచ్చలు తగ్గి ముఖ వర్ఛస్సు పెరుగుతుంది. రోజూ రెండుసార్లు ముఖానికి రాసుకుంటూ ఉంటే మంచి ఫలితం త్వరగా వస్తుంది. 

చదవండి:  Hair Fall Control Tips: జుట్టు రాలకుండా ఉండాలంటే..?

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top