ఆర్టిస్ట్‌ టు బారిస్టర్‌ | Appointment of Satinder as Chairperson of Punjab Arts Council | Sakshi
Sakshi News home page

ఆర్టిస్ట్‌ టు బారిస్టర్‌

Mar 5 2023 12:52 AM | Updated on Mar 5 2023 12:52 AM

Appointment of Satinder as Chairperson of Punjab Arts Council - Sakshi

ఏ పని లేకుండా ఖాళీగా కూర్చుంటే బుర్ర దెయ్యాల ఫ్యాక్టరీ అవుతుందట!లాక్‌డౌన్‌ టైమ్‌లో సతిందర్‌కు బోలెడు ఖాళీ సమయం దొరికింది.ఆ ఖాళీ సమయంలో వృథా ఆలోచనలకు అవకాశం ఇవ్వకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కెనడాలో లా డిగ్రీ ఉత్తీర్ణురాలై ప్రశంసలు అందుకుంటోంది సతిందర్‌...

పంజాబ్‌లోని బటాలా పట్టణానికి  చెందిన సతిందర్‌ సట్టి నటి, కవయిత్రి, డ్యాన్సర్, సింగర్, టెలివిజన్‌ యాంకర్‌గా బహుముఖ ప్రజ్ఞ చాటుకుంది. ‘కవిత్వం అనేది విప్లవాత్మకమైన వేదిక’ అని చెప్పే సతిందర్‌ కవిత్వంలో సామాజిక సమస్యలు ప్రధానంగా కనిపిస్తాయి. టీవి యాంకర్‌గా ఎంతోమంది సామాన్యుల అద్భుతగాథలను ‘బోల్‌ దే’ కార్యక్రమంతో ప్రేక్షకులకు పరిచయం చేసింది.

‘పంజాబ్‌ ఆర్ట్స్‌ కౌన్సిల్‌’ ఛైర్‌పర్సన్‌గా సతిందర్‌ నియామకం అయినప్పుడు ‘నలభై ఏళ్లు దాటని వ్యక్తికి ఈ పదవి ఎలా ఇస్తారు’ అని కొందరు పనిగట్టుకొని విమర్శించారు.అయితే తన పనితీరుతో విమర్శించిన వారే ప్రశంసించేలా చేసింది సతిందర్‌.

తాజా విషయానికి వస్తే.... ‘సతిందర్‌ ఇప్పుడు కెనడాలో బారిస్టర్‌’ అంటూ వార్తల్లోకి వచ్చింది. 2020లో సతిందర్‌ కెనడాలో ఉంది. ఆ సమయంలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఇండియాకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ‘సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి?’ అనేదాని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆమె దృష్టి లా డిగ్రీపై పడింది. అమృత్‌సర్‌లోని ‘గురునానక్‌ యూనివర్శిటీ’లో సతిందర్‌ ‘లా’ చేసింది. ఆ డిగ్రీని కెనడియన్‌ లా డిగ్రీతో అప్‌గ్రేడింగ్‌ చేసుకోవాలని నిర్ణయించుకుంది. 

ఇండియాలో ‘లా’ చేసిన వారు కెనడాలో ప్రాక్టిస్‌ చేయాలంటే అక్కడి ఎన్‌సీఎ(నేషనల్‌ కమిటీ ఆన్‌ అక్రిడియేషన్‌) గుర్తింపు పొందాల్సి ఉంటుంది. దీని కోసం బారిస్టర్‌ ఎగ్జామ్స్‌కు హాజరు కావాలి. అయిదుకు పైగా ఎగ్జామ్స్‌ ఉంటాయి. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోతే కెనడా లా స్కూల్‌లో సంవత్సరం పాటు చదవాల్సి ఉంటుంది.పరీక్షలకు ప్రిపేర్‌ కావడానికి గుర్‌ప్రీత్, జస్వంత్‌ మంగత్‌లాంటి న్యాయవాదుల సలహాలు, సూచనలు తీసుకుంది.

చాలామంది కఠినంగా భావించే ఆ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి బారిస్టర్‌ లైసెన్స్‌ పొందింది సతిందర్‌. లైసెన్స్‌ అవార్డింగ్‌ సమయంలో అక్కడి న్యాయ అధికారులు సతిందర్‌ బహుముఖ ప్రతిభ గురించి ప్రశంసించడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement