‘కుకు అబౌట్ నేచర్ క్లబ్’ - అమన్ శర్మ
ఢిల్లీ మహా నగరమంటే పొద్దెక్కక ముందే రోడ్డెక్కిన వాహనాలు, నాన్‌స్టాప్‌గా మోగే హారన్ మోతలు, గందరగోళాలు, గజిబిజీ బతుకులు.. కాని అదే నగరంలో మరోప్రదేశంలో తెల్లవారకముందే వినిపించే పక్షుల కిలకిలారావాలు, సూర్యకాంతి వెలుగులో జిలుగులు విరజిమ్మే సీతాకోక చిలుకలు, ఆకాశానికి నిచ్చెనేసినట్టు ఎగబాకే మొక్కలు... ఇదంతా ఓ ఇంటిపైన ... దీని వెనుక ఉంది ఓ కుర్రాడి తపన.
ఢిల్లీ వాసి అమన్ శర్మకి 19 ఏళ్లు. బాల్యం నుంచి అతని అమ్మానాన్నలు తరచూ పక్షుల సంరక్షణా కేంద్రాలకు తీసుకెళ్లేవారు. లాక్‌డౌన్ టైంలో మాత్రం ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అమన్‌కి అప్పుడొచ్చిన ఐడియానే ‘అర్బన్ జంగిల్.’ తన ఇంటిపైన ఉన్న 1500 చదరపు అడుగులను చిన్నసైజు అడవిలా మార్చాలనుకున్నాడు. ఒక్కొక్క పూలకుంyీ ని ఏర్పాటు చేస్తూ వాటిని సంరక్షిస్తూ వచ్చాడు. అలా తన ఇంటి మేడమీద 500 మొక్కలను పెంచాడు. ఒకప్పుడు అలారం పెట్టుకుని లేచే అమన్‌కి ఇప్పుడు రోజూ పక్షుల కిలకిలారావాలతోనే మెలకువ వస్తుంది. మేడమీదకెళ్లగానే సీతాకోక చిలుకలు స్వాగతం పలుకుతాయి. వాటిని తరుముకుంటూ వచ్చి జామపళ్లను తింటూ చిలుకలు తమ ఆధిపత్యాన్ని చూపిస్తున్నాయి.
దాదాపు వందకు పైగా రకాల చెట్లు పెరుగుతున్న ఈ అర్బన్ జంగిల్‌లో 25 నుంచి 30 రకాల పక్షిజాతులు రోజూ వస్తుంటాయి. ఢిల్లీ పరిసరప్రాంతాలలో ఇలాంటి పక్షిజాతులు కూడా ఉన్నాయా అంటూ... చూసిన వారంతా విస్తు΄ోతున్నారు. పక్షులను, కీటకాలను ఆకర్షించడానికి నిమ్మ, కరివేపాకు, మిల్క్‌వీడ్, జామ, దానిమ్మ, స΄ోట వంటి చెట్లను నాటితే సీతాకోక చిలుకలు, తేనెటీగలు, చిలుకలతోపాటు ఇతర పక్షులను ఆకర్షించవచ్చని అమన్ పేర్కొన్నాడు.
అమన్ 14 ఏళ్ల వయసులోనే పిల్లల కోసం పిల్లలు మాత్రమే నడిపే ‘కుకు అబౌట్ నేచర్ క్లబ్’ అనే క్లబ్‌నుప్రారంభించాడు. ఈ క్లబ్‌ద్వారా పిల్లల్ని ఢిల్లీ పరివాహకప్రాంతాల్లోని నేచర్ పార్క్‌లకు తీసుకెళ్లేవాడు. అచిరకాలంలోనే ప్రకృతి ప్రేమికులు అనేకమంది అమన్‌తో జతకట్టారు. అలా మొదలైన ఈ చిన్నపిల్లల క్లబ్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద బర్డ్ కమ్యూనిటీ క్లబ్‌గా తయారైంది.
పర్యావరణ పరిరక్షణలో అమన్ చూపిన చొరవకు ఐక్యరాజ్యసమితి (యుఎన్‌జీఏ) నోబుల్ పీస్ సెంటర్ వంటి ప్రతిష్టాత్మక వేదికల నుంచి పిలుపు వచ్చింది. అంతేకాదు నగరాల్లోని వన్య్రపాణుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రముఖ బ్రాండ్ నికాన్ నియమించిన అంబాసిడర్‌లలో అత్యంత పిన్న వయస్కుడిగా అమన్ గుర్తింపుపొందాడు.


