పెనుగొండ : అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసవీ శాంతి థాంలో త్వరలోనే వేద పాఠశాల నిర్వహించనున్నట్టు ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజులు తెలిపారు. సోమవారం వాసవీ శాంతి థాంలో విలేకరులతో మాట్లాడుతూ వేద పాఠశాలలో పూర్తిస్థాయిలో వేదాభ్యాసం చేయిస్తామని, ఆలయాల్లో అర్చకులుగా ఉపాధి కల్పించేందుకు కృషిచేస్తామన్నారు. 102 రుషీ గోత్ర మందిరాన్ని సువర్ణ మందిరంగా తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. ముందుగా గ్రీన్ టెంపుల్ చేయడమే లక్ష్యంగా అర్కిటెక్‌లు కృషి చేస్తున్నారన్నారు. ఆధ్యాత్మిక శోభ విరాజిల్లేలా సుందరీకరణ పనులు ప్రారంభించామన్నారు.


