న్యూస్‌రీల్
జీవ వైవిధ్య పరిరక్షణ అందరి బాధ్యత
చెట్టుకిందే చెక్‌పోస్టు
దెందులూరు: ఏలూరు రూరల్ మండలం చాటపర్రులో ఏఎంసీ చెక్‌పోస్ట్ కేవలం చెట్టు కిందే నిర్వహిస్తున్నారు. ఇక్కడ చెక్‌పోస్టు బోర్డు మాత్రమే ఉంది.
శురకవారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2026
కై కలూరు: జీవ వైవిధ్యం అంటే భూమిపై ఉండే జన్యువులు, మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు సహా పలు జాతులు, పర్యావరణ వ్యవస్థల సముదాయం. అయితే మానవ తప్పిదాల వల్ల అరుదైన జాతులు అంతరించిపోతుండడంతో జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ తరాలకు జీవ వైవిధ్యాన్ని అందించేందుకు ఏటా మే 22న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు (ఏపీఎస్‌బీబీ) బయోడైవర్సిటీపై అవగాహన కల్పిస్తోంది. ఈ ఏడాది స్థానిక చర్యలు – ప్రపంచ ప్రభావం అనే నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా జీవ వైవిధ్యంపై అవగాహన పెంచుతున్నారు.
ఉమ్మడి పశ్చిమకే కళ
రాష్ట్రంలో 37,258 చదరపు కిలోమీటర్లలో అటవీ విస్తీర్ణం ఉంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో జీవ వైవిధ్యం ఉట్టిపడుతోంది. కొల్లేరు సరస్సు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకై క చిత్తడి నేలల ప్రాంతంగా గుర్తింపు పొందింది. కొల్లేరులో 184 జాతుల పక్షులు సంచరిస్తాయి. ఇక పాపికొండల ప్రయాణం జీవితంలో మరుపురానిది. వీటితో పాటు రాష్ట్రంలో రోళ్లపాడు, కోరింక, నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్, శ్రీ వేంకటేశ్వర జాతీయ ఉద్యానవనం, శేషాచల కొండలు, పులులు, చిరుతలు, ఏనుగులు, పక్షులు ఇలా ఎన్నో ఆకట్టుకుంటాయి. తూర్పుతీరంలో రెండో అతిపెద్ద మడ అడవులు ఉన్నాయి. జీవ వైవిధ్య హాట్‌స్పాట్‌లుగా చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలు వినతికెక్కాయి. మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్‌గా శేషాచలం కొండలను గుర్తించారు. నల్లమల ఏపీలో అతిపెద్ద అడవి.
అంతరిస్తున్న అరుదైన జాతులు
మానవ తప్పిదాల వల్ల అరుదైన జాతులు అంతరిస్తుండడంతో జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లుతోంది. ఆడవుల నరికివేత, రసాయనాల వాడకం, కాంక్రిట్ జంగిల్, ఆహార, ఆవాసాల కొరత ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) రెడ్ లిస్ట్ వెల్లడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఐయూసీఎన్ 48,600 జాతులు అంతరిస్తున్నాయని ప్రకటించింది. ఏపీలో ఎర్ర చందనం, సెరోఫిజియా ఆండ్రికా వంటి మొక్కలు, జెర్డాన్ కోర్సర్ పక్షి, ఫిషింగ్ క్యాట్ వంటి జంతువులు అంతరిస్తున్నాయి.
నిధుల కొరతతో బీఎంసీ కమిటీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు (ఏపీఎస్‌బీబీ) అనేది 2002 జీవవైవిధ్య చట్టం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక చట్టబద్ధమైన సంస్థ. జీవవైవిధ్య పరిరక్షణ, సుస్థిర వినియోగం, జీవవనరుల వినియోగంతో కలిగే ప్రయోజనాలు వంటి విషయాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వడం ఈ బోర్డు బాధ్యత. మన రాష్ట్రంలో బయోడైవర్సిటీ మేనేజ్‌మెంట్ కమీటీలు(బీఎంసీ)లు కీలకంగా ఉన్నాయి. రాష్ట్రంలో పంచాయతీలు మండల, మున్సిపాలిటీ, మున్సిపాల్ కార్పొరేషన్లు జిల్లా కమిటీలు వెరసి 14,117 ఉన్నాయి. అత్యధికంగా 13,363 పంచాయతీ కమిటీలు పనిచేస్తున్నాయి. నిధుల కొరత కమిటీలను వేధిస్తోంది.
జీవి వైవిధ్యం భూమిపై సమస్త జీవరాశికి పునాది వంటిది. ఇందులో జన్యు వైవిధ్యం, జాతుల వైవిధ్యం, పర్యావరణ వైవిధ్యం అనే మూడు రకాలు ఉంటాయి. కలుషిత నీరు కారణంగా కొల్లేరు సరస్సులో అరుదైన నల్లజాతి చేపలు అంతరిస్తున్నాయి. జీవి వైవిధ్యానికి అందరూ కట్టబడి ఉండాలి.
– డాక్టర్ పి.రామమోహనరావు,
విశ్రాంత మత్స్యశాఖ ఉపసంచాలకుడు, కాకినాడ
నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం
ఈ ఏడాది ‘స్థానిక చర్యలు – ప్రపంచ ప్రభావం’ అనే నినాదం
జిల్లాలో జీవ వైవిధ్యానికి నిలయాలుగా కొల్లేరు, మడ అడవులు
అంతరించిపోతున్న అరుదైన జాతులు


