తిరుమల పవిత్రతను కాపాడండి | - | Sakshi
Sakshi News home page

తిరుమల పవిత్రతను కాపాడండి

Apr 5 2026 8:24 AM | Updated on Apr 5 2026 8:24 AM

ఈస్టర్‌కు సన్నద్ధం హిజ్రాల రౌడీయిజం

న్యూస్‌రీల్‌

తిరుమల ప్రతిష్టకు శాపం

టీటీడీకి మచ్చ

సీఎం చోద్యం చూస్తున్నారు

చాలా దారుణం

ఈస్టర్‌కు సన్నద్ధం
క్రైస్తవ విశ్వాసులు ఈస్టర్‌ పండుగను ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. మృతిచెందిన తమ వారి సమాధులను సుందరంగా అలంకరించారు. 8లో u

ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో కొందరు హిజ్రాల రుబాబు రోజురోజుకు పెచ్చుమీరుతోంది. పోలీసులను కూడా వారు లెక్కచేయడం లేదు. 8లో u

ఆదివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చిన టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడును వెంటనే చైర్మన్‌ పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత ఆయా ప్రాంతాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయం బయట సీఎం చంద్రబాబు, బీఆర్‌ నాయుడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిందువులు పవిత్రంగా భావించే తిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్‌గా ఉంటూ అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన బీఆర్‌ నా యుడిని పదవి నుంచి తొలగించకుండా వెనకేసు కుని రావడంలో చంద్రబాబు ఉద్దేశం ఏంటో స్ప ష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ నాయుడుపై వెంటనే చర్యలు తీసుకోకుంటే హిందువుల ఆగ్రహ జ్వాలల్లో గురికాకతప్పదని హెచ్చరించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

కై కలూరు నియోజకవర్గం.. కై కలూరులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నిరసన తెలిపారు.

దెందులూరు నియోజకవర్గం.. పెదపాడు మండల కలపర్రులో వేణుగోపాలస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు లాంటి వారిపై చర్యలు తీసుకోకుండా సీఎం ఉదాసీనంగా వ్యవహరించడం హేయమైన చర్య అన్నారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరి పూజలు నిర్వహించి అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఉంగుటూరు నియోజకవర్గం.. భీమడోలులోని రూపక వేంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆందోళన చేశారు.

నూజివీడు నియోజకవర్గం.. నూజివీడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పోలవరం నియోజకవర్గం.. కొయ్యలగూడెం వై.జంక్షన్‌ వద్ద దుర్గమ్మ ఆలయంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిరసన తెలిపారు.

ఏలూరు నియోజకవర్గం.. ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు.

చింతలపూడి నియోజకవర్గం.. చింతలపూడిలోని రామాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి అనంతరం పార్టీ శ్రేణులతో నిరసన తెలిపారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నినాదాలు చేస్తున్న ఏలూరు కన్వీనర్‌ మామిళ్లపల్లి జయప్రకాష్‌, నాయకులు

పెదపాడు: కలపర్రులో నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్‌

తిరుమల ప్రతిష్టకు శాపంగా టీ టీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు పా పాలు నిలుస్తున్నాయి. వెంటనే ఆయన్ను పదవి నుంచి తొలగించాలి. ఛీత్కారం ఎదుర్కొంటు న్నా బీఆర్‌ నాయుడిని తొలగించకపోవడం అ నుమానాలకు తావిస్తోంది. చంద్రబాబులో వీక్‌ పాయింట్లు బీఆర్‌ నాయుడికి తెలుసు, అందుకే చర్యలు తీసుకోవడం లేదు.

– దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే,

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు రాసలీలలు చేస్తూ సాక్ష్యాధారాలతో దొరికిపోయారు. మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రానికి మచ్చ తెచ్చారు. అలాంటి వ్యక్తిని సీఎం చంద్రబాబు క్షమిస్తున్నాడు. కలియుగ దైవం తగిన శాస్తి చేయడం ఖాయం. సనాతనీ అని చెప్పుకునే పవన్‌కల్యాణ్‌ మౌనం వహించడం దారుణం.

– పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మెల్యే, ఉంగుటూరు

కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన బీఆర్‌ నాయుడిని పదవి నుంచి తొలగించి తిరుమల పవిత్రత కాపాడాలి. టీటీడీ చైర్మన్‌ అశ్లీల కార్యక్రమాలకు పాల్పడిన వీడియోలు వైరల్‌ అయినా ఆయన్ను ఇప్పటివరకూ పదవి నుంచి తొలగించకుండా సీఎం చంద్రబాబు చోద్యం చూస్తున్నారు.

– కొఠారు అబ్బయ్యచౌదరి, దెందులూరు కన్వీనర్‌

బీఆర్‌ నాయుడు టీటీడీ చైర్మన్‌గా ఉంటూ అసాంఘిక, అనైతిక చర్యలకు పాల్పడటం దారుణం. బీఆర్‌ నాయుడు రాసలీలలు వెలుగులోకి వచ్చి నెల రోజులు దాటుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు బీఆర్‌ నాయుడుతో అంటకాగుతూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారు.

– మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు,

మాజీ ఎమ్మెల్యే, నూజివీడు

సద్బుద్ధి ప్రసాదించు స్వామీ

టీటీడీ చైర్మన్‌ను తక్షణమే తొలగించాలి

హిందువుల ఆగ్రహ జ్వాలలకు గురికాక తప్పదు

జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నిరసనలు

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement