చర్యలు తీసుకోరా? | - | Sakshi
Sakshi News home page

చర్యలు తీసుకోరా?

Apr 5 2026 8:24 AM | Updated on Apr 5 2026 8:24 AM

చర్యలు తీసుకోరా? మనోభావాలతో ఆటలా..? సద్బుద్ధి ప్రసాదించాలి

క్రిమినల్స్‌పై చర్యలు తీసుకోకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆధ్యాత్మికమైన ఉన్నత పదవిలో ఉన్న బీఆర్‌ నాయుడు మహిళపై లైంగికంగా వ్యవహరించిన తీరును ఖండించకుండా వత్తాసు పలుకుతోంది. కూటమి ప్రభుత్వంలో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులకు అండదండలు అందిస్తున్నారు. బీఆర్‌ నాయుడు ఉమనైజర్‌.

–తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే, పోలవరం

కోట్లాది మంది హిందువుల మనోభావాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోంది. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు మహిళతో అసభ్యంగా ప్రవర్తించగా వీడియోలతో సహా సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం హిందువులను దిగ్భ్రాంతికి గురిచేసింది. చైర్మన్‌ అనైతిక కార్యకలాపాల వలన తిరుమల తిరుపతి దేవస్థానం అప్రతిష్టపాలవుతోంది. బీఆర్‌ నాయుడు రాజీనామా చేయాలి.

– మామిళ్లపల్లి జయప్రకాష్‌, ఏలూరు కన్వీనర్‌

తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న బీఆర్‌ నాయుడుని వెంటనే టీటీడీ చైర్మన్‌ పదవి నుంచి తొలగించాలి. పవిత్ర క్షేత్రానికి కళంకం తెచ్చిన వ్యక్తిని పదవిలో కొనసాగించడం సరికాదు. ఈ విషయంలో సీఎం చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించాలని స్వామివారికి విన్నవించుకున్నాం. రాష్ట్రంలో కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది.

– కంభం విజయరాజు, చింతలపూడి కన్వీనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement