హుండీ ఆదాయం రూ.18.97 లక్షలు | - | Sakshi
Sakshi News home page

హుండీ ఆదాయం రూ.18.97 లక్షలు

Mar 25 2026 7:23 AM | Updated on Mar 25 2026 7:23 AM

హుండీ ఆదాయం రూ.18.97 లక్షలు

పాలకొల్లు సెంట్రల్‌: స్థానిక శ్రీక్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం స్వామివారి హుండీ ఆదాయం లెక్కించగా రూ. 18,97,247 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 105 రోజులకు గాను ఈ ఆదాయం లభించిందన్నారు. క్షీరపురి అన్నదాన సమాజం, సలాది వారి సత్రం, చినగోపురం ఆలయ ఈవోలు ఎన్‌ రంగరాజన్‌, వి నాగజ్యోతి, బీవీవీఎస్‌ శంకర్‌ల పర్యవేక్షణలో హుండీల లెక్కింపు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీలు స్టేట్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఇసాక్‌ బాషా, సభ్యులు కవురు శ్రీనివాస్‌, ఎన్‌వీ రామచంద్రారెడ్డి హుండీ లెక్కింపును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ ధర్మాదాయ శాఖ భీమవరం డివిజన్‌ అధికారి వర్ధినీడి వెంకటేశ్వరరావు, ఆలయ చైర్మన్‌ మీసార రామచంద్రరావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement